సీమాంధ్రులు కావాలనే సభనడ్డుకుంటున్నారు : జానారెడ్డి
సాగదీతవద్దన్నం : డీకే అరుణ
హైదరాబాద్, డిసెంబర్ 24 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి అభిప్రాయం చెప్పేందుకు సమయం పొడిగించవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది చేసిన రాష్ట్రపతిని టీ మంత్రులు, నేతలు మంగళవారం కలిశారు. అసెంబ్లీకి విభజన బిల్లు చేరినా దానిపై ఎలాంటి చర్చ జరపకుండా అపహాస్యం చేస్తున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీకి బిల్లు చేరి 14 రోజులైనా ఎలాంటి చర్చ జరగలేదని.. ఉద్దేశపూర్వకంగానే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని రాష్ట్రపతి కి వివరించారు. విభజనను అడ్డుకుంటామంటూ సీఎంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తూ సీమాంధ్ర ప్రజలను మభ్య పెడ్తున్నారని ఆరోపించారు. ఆలస్యం జరగకుండా నిర్దేశిత సమయంలోనే బిల్లు తెప్పించుకోవడానికి చర్యలు తీసుకోవాలని వివరించినట్లు తెలంగాణ ప్రజాప్రతినిధులు చెప్పారు. ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్‌రెడ్డా? అశోక్‌బాబునా అన్న విషయం ఎవరో అర్థం కావటం లేదని రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. రాష్ట్రపతితో టీ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రుల భేటీ అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ‘విూరు పంపించిన బిల్లును కావాలని జాప్యం చేస్తున్నారని’ రాష్ట్రపతి ప్రణబ్‌కు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బిల్లును ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారని వివరించినట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి ఏంకావాలో అక్కడి నాయకులు అడిగితే బాగుంటుందని అన్నారు.
స్పీకర్ తన అధికారాలన్నీ ఉపయోగించి శాసనసభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జానారెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకమో లేక సభ్యులకు అవగాహన కోసమో సభను జనవరి 3 వరకు వాయిదా వేశారని, శాసనసభలో అహంకార పూరిత పద్దతుల్లో కొందరు ఆందోళనకు దిగుతున్నారని జానారెడ్డి ఆరోపించారు. అయితే ఎవరెన్ని విధాలుగా అడ్డుకున్నా తెలంగాణ ఆగదన్నారు. గడువులోగా బిల్లుపై చర్చ ముగించకుండా మరింత సమయం కోరే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణ బిల్లుపై జాప్యం వల్ల ఇరు ప్రాంతాల ప్రజలు ఘర్షణలకు దిగే ప్రమాదం ఉందన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. సీఎం కూడా ఒక వ్యక్తేనని, కేంద్ర ప్రభుత్వం అనే శక్తి ముందు వ్యక్తుల కుట్రలు పనిచేయవని జానారెడ్డి అన్నారు.ఎవరెన్ని కుట్రలూ, కుయుక్తులు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పటికే నిర్ణయం జరిగిపోయాక ఇలాంటి కుయుక్తులతో ముందుకు సాగడం సరికాదన్నారు. అలాగే సీమాంధ్రకు ఏం కావాలో చెప్పితే ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేసినవారు అవుతారని అన్నారు. సీఎం కూడా ఒక వ్యక్తే.. కేంద్ర ప్రభుత్వం అనే శక్తి ముందు వ్యక్తుల కుట్రలు పనిచేయవని తెలిపారు. ఇలాంటి చర్యలతో మరింత ఉద్రిక్తతలకు తోడ్పడవద్దన్నారు. స్పీకర్ తన అధికారాలను ఉపయోగించి శాసనసభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చర్చ జరిగితే అనుమానాలు కూడా నివృత్తి అవుతాయన్నారు. శాసనసభలో అహంకార పూరిత పద్దతుల్లో కొందరు ఆందోళనకు దిగడం సరికాదన్నారు. చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బిల్లుపై చర్చ ముగించకుండా మరింత సమయం కోరే కుట్ర జరుగుతోందని జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుపై జాప్యం వల్ల ఇరుప్రాంతాల ప్రజలు ఘర్షణలకు దిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది ఎవరికి కూడా క్షేమకరం కాదన్నారు. పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రక్రియను సాగదీయవద్దని రాష్ట్రపతిని కోరామన్నారు. తెలంగాణ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ప్రజల ఆకాంక్షపై జాప్యం వద్దని విజ్ఞప్తి చేశామన్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రి బలరాం నాయక్, మంత్రి జానారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతిని కలిశారు.
ప్రణబ్ జీ… సమయం పొడిగించొద్దు




