శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
డిల్లీ, డిసెంబర్25(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని జన్మదిన శుశాకాంక్షలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వాజ్‌పేయి నివాసానికి వెళ్లి 89వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 20 నిమిషాల పాటు ప్రధాని వాజ్‌పేయితో గడిపారు. ఆ తర్వాత భాజాపా అగ్రనేత అద్వానీ వాజ్‌పేయి నివాసానికి వచ్చి జన్మదిన శాభాకాంక్షలు తెలిపారు. భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమత్రులు, పలువురు ఇతర నేతలు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న వాజ్‌పేయి అధికారిక నివాసంలోనే ఉంటున్నారు. హైదరాబాద్‌లోనూ భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా నగరంలో భాజాపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో భాజాపా నేత వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఘనంగా జన్మదిన వేడులు




