కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయండి
లోక్‌పాల్ ఘనత యూపీఏదే
ధరలు నియంత్రించండి
ప్రజల మన్ననలు పొందండి
12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాహుల్ ఉద్భోద
న్యూఢిల్లీ, డిసెంబర్ 27 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్యమంత్రులకు సూచించారు. నిత్యావసర ధరలు నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ధరల నియంత్రణలో ఆయా రాష్ట్రాల సీఎంలు చురుకుగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అవినీతికి తావుండకూడదని తెలిపారు. అవినీతి అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎంలకు రాహుల్ సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ భవిస్యత్ వ్యూహరచనలో ఉన్నారు. ఇందులో భాగంగా సీఎంల సమావేశంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా రాహుల్ సీఎంల సమావేశం నిర్వహించారు. ప్రజోపయోగమైన సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా రాహుల్‌గాంధీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించారు. అలాగే ‘విూ సేవ’ను బలోపేతం చేయాల్సిందిగా పేర్కొన్నారు. 14రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాహుల్‌గాంధీ నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీతో సీఎం ప్రత్యేకంగా భేటీ- అయ్యారు. భేటీలో రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచి కాంగ్రెస్‌ను పరిరక్షించాలని కోరారు. కాంగ్రెసు పార్టీ వార్ రూంలో ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గెలుపు పాఠాలు చెప్పారు. శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు రాహుల్‌తో పార్టీ సిఎంల సమావేశం ప్రారంభమైంది. సాయంత్రం మూడున్నర గంటల దాకా ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే కిరణ్‌కు సమైక్యవాదం వినిపించే అవకాశం రాలేదు. భూసేకరణ బిల్లు, లోక్‌పాల్ బిల్లు, ఆహార భద్రత బిల్లులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని రాహుల్ సూచించారు. యూపిఏ 2 హయాంలో ప్రవేశ పెట్టిన బిల్లులు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఏ మేరకు ఉపయోగపడుతాయో చర్చించారు. ప్రధానంగా అవినీతి, ద్రవ్యోల్భణంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అవినీతి నిర్మూలనకు సూచనలు చేశారు. అవినీతిరహిత పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. 2014 కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో పైన ముఖ్యమంత్రుల సలహాలు తీసుకున్నారు. ఈ భేటీలో రాహుల్, ముఖ్యమంత్రులతో పాటు ఎకె ఆంటోని, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, అహ్మద్ పటేల్, జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్, జనార్ధన్ ద్వివేది, కపిల్ సిబాల్, కెబి థామస్ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్, మిజోరాం, అస్సాం, కర్నాటక, ఆంధప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయల రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. సమావేశంలో రాహుల్ పలు అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగారు. కిరణ్ సమైక్యం గురించి చెప్పేందుకు ఉపక్రమించగా రాహుల్ ఇప్పుడు కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. కిరణ్ విభజన అంశం లేవనెత్తగా దీనిపై ఇద్దరం ప్రత్యేకంగా తర్వాత మాట్లాడుతామని సూచించారని సమాచారం.