ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
న్యూఢిల్లీ, డిసెంబర్ 28 (జనంసాక్షి) :
ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై పున: సమీక్షిస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ అవతరణ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా విూడియాతో మాట్లాడుతూ అవినీతిపై మా తప్పులు ఉంటే ఎత్తి చూపిండని అడిగారు. అవినీతిపై కాంగ్రెసేతర రాష్టాల్రు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో మీడియా చూపాలన్నారు. కాంగ్రెస్ ఎదుట కఠినమైన సవాళ్లు ఉన్నాయని, ఐక్యంగా ఉండి సవాళ్లను ఎదుర్కొంటామని సోనియా పేర్కొన్నారు. తాము అనేక కార్యక్రమాలు చేపట్టామని, మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం అమలు చేస్తున్నామని అన్నారు. ఇందులో లోపాలుంటే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. ప్రతిపక్షాలకు వత్తాసు పలుకుతూ.. అవినీతి సమస్య విషయంలో విూడియా సంస్థలు పక్షపాతం వహిస్తూ కథనాలను ప్రసారం చేయడం మానుకోవాలని సోనియా గాంధీ సూచించారు. కాంగ్రెసేతర పార్టీల పాలనలోని రాష్టాల్లోన్రూ అవినీతిపై విూడియా దృష్టి సారించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనలోని గుజరాత్‌లో కూడా, అక్కడి కొందరు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వాటిపైనా మీడియా దృష్టి పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోని రాష్టాల్లోన్రే కాకుండా ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోని అవినీతిపై కూడా మీడియా దృష్టి సారించాలని సోనియా అన్నారు.తమ ప్రభుత్వ పాలనలో ఉన్న మహారాష్ట్రలోని తమ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సమయంలో ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై జుడిషియల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ హైకమాండ్ కోరినట్లు ఆమె తెలిపారు. కాగా మహారాష్ట్ర కేబినెట్ డిసెంబర్ 20న ఆ నివేదికను తిరస్కరించింది. అయితే మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల సమావేశంలో తప్పుపట్టారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా పాల్గొన్నారు. కాగా వ్యక్తిగతంగా తాను ఆ నిర్ణయాన్ని అంగీకరించనని రాహుల్ గాంధీ తెలిపారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో ఎవర్ని కాపాడుతున్నారనే ప్రశ్న అవసరం లేదని రాహుల్ తెలిపారు. ఆ నివేదిక సమస్యకు పరిష్కారం చూపుతుందని సోనియా గాంధీ శనివారం తెలిపారు. కాగా మాజీ న్యాయమూర్తి జెఏ పాటిల్ నేతృత్వంలోనే జుడిషియల్ కమిషన్ ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత విలాస్‌రావుదేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండేలను దోషులు పేర్కొంది. కార్యక్రమంలో రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్ర ఎంపీలు ఆనంద భాస్కర్, ఎంఏ ఖాన్, కేంద్ర మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.
‘ఆదర్శ్’ నివేదిక పున: సమీక్షిస్తాం : సోనియా




