Tuesday, 3 November 2026

ప్రణబ్‌ జీ.. తెలంగాణకు సహకరించండి

టీ కాంగ్రెస్‌ నేతల విజ్ఞప్తి
హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) :
ప్రణబ్‌ జీ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని టీ కాంగ్రెస్‌ నేతలు భారత రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం టీ కాంగ్రెస్‌ నేతలు వేర్వేరుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. ఉదయం డెప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్క, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శంకర్‌రావు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వర్‌రావు తదితరులు ప్రణబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. సాయంత్రం టీ కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ బిల్లును తర్వగా పార్లమెంట్‌కు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను త్వరగా నెరవేరేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ,
రాష్ట్రపతి ప్రణబ్‌ ఆదేశాలను రాష్ట్ర శాసనసభ, మండలి పాటించాలని సూచించారు. రాష్ట్రపతి ఆదేశానుసారం బిల్లుపై చర్చించాల్సిందేనన్నారు. అందుకు భిన్నంగా నడుచుకుంటే రాష్ట్రపతిని అగౌరవపరిచినట్టేనని అన్నారు. బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలను కొనసాగనివ్వాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *