టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్
హైదరాబాద్, డిసెంబర్ 29 (జనంసాక్షి) :
ఉద్యోగులకు హెల్త్‌కార్డుల అమలుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ కోరారు. ఆదివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతితో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు. ఇన్‌పేషెంట్‌గా చేరిన వారితో పాటు ఔట్ పేషెంట్లకు పరీక్షలు, మందులు కూడా హెల్త్ కార్డుల కింద అందజేయాలని కోరామని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలపైనా దృష్టి సారించాలని కోరామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంపు, హెల్త్‌కార్డుల సమస్యలపైనా చర్చించామన్నారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని నూతన సంవత్సర కానుగా ఐఆర్‌తో పాటు హెల్త్‌కార్డులు జారీ చేస్తామని సీఎస్ తెలిపారన్నారు. దీనికి ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య కార్డుల అమలుకు స్టీరింగ్ కమిటీ వేయాలి





