ఒంగోలు: రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెడితే వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టంగుటూరు కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పుడు, ఎప్పుడూ ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిరారని చెప్పారు. ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఏడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలో ఉండగా డ్వాక్రా మహిళల కోసం దీపం పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని విమర్శించారు. హైదరాబాద్‌తో పాటు వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, తానేనని గుర్తు చేశారు.




