టీడీపీ అధినేత చంద్రబాబు
ఒంగోలు, డిసెంబర్ 30 (జనంసాక్షి) :
నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నాడు. టీడీపీ విజన్ 20-20 తెస్తే కాంగ్రెస్ పార్టీ 420 చేసిందని నిస్సిగ్గుగా చెప్పాడు. ఒంగోలు సోమవారం నిర్వహించిన ప్రజాగర్జనలో చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. 10వేల కోట్లతో వేలాది ఎకరాలకు నీరందించామని చెప్పారు. 89 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఒక ఎకరాకు కూడా కాంగ్రెస్ పార్టీ నీరివ్వలేదని ఆరోపించారు. 152 కోట్లతో రామతీర్థం పూర్తి చేశామని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 650 కోట్లు ఖర్చు చేశారు గాని ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు క్లియరెన్సు ఇప్పించింది టీడీపీనేనని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు మిగులు జలాలు వద్దన్న వైఎస్ ప్రాజెక్టులను కట్టించింది రాష్ట్రాన్ని దోచుకునేందుకే కదా అని అన్నారు. ఎస్‌ఇజడ్‌ల పేరిట కోట్లాది రూపాయల విలువైన భూములను 2,800 ఎకరాలను వాన్‌పిక్ ద్వారా లాక్కున్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. వీరి ద్వారా వచ్చిన డబ్బునే 800 కోట్ల రూపాయలను జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. జగన్‌కు ఇంతలోనే బెయిల్ రావడం కాంగ్రెస్‌తో కుమ్మక్కవ్వడం కారణం కాదా అని ప్రశ్నించారు. ఇదేమి రాజరికపు వ్యవస్థనా..30ఎకరాల్లో ఇల్లా..పెద్ద పెద్ద గదులతో ప్యాలెస్సా..దొంగల పక్కన ఎవరైనా కూర్చుంటారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రస్థానం మొత్తం పోరాటాలతోనే కూడుకున్నదని, చెన్నారెడ్డి, జనార్దనరెడ్డి, విజయభాస్కరరెడ్డి, సోనియాలపై పోరాడింది టీడీపీయేనని అన్నారు.
నవ్విపోదురుగాక! హైదరాబాద్‌పై హక్కులు నావే




