రాష్ట్రాల ఏర్పాటు అధికారం పార్లమెంట్‌కే
ఆందోళన వద్దు : కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 31 (జనంసాక్షి) :
మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్పుద్వారా తెలంగాణకు ఏం ఫరక్ పడదని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రాల ఏర్పాటు అధికారం పార్లమెంట్‌కే ఉందని ముఖ్యమంత్రి చర్యలతో వచ్చే ఇబ్బందే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రమంత్రివర్గంలో మార్పులపై తెలంగాణ ప్రజానీకం ఎటువంటి ఆందోళన చెందవద్దని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో శాసనసభ, మండలికి ఎటువంటి అధాకారాలు లేవని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చివరి దశకు చేరుకున్న సందర్భంలో ఇటువంటి వింతలు సహజమన్నారు. రాష్ట్రాల ఏర్పాటుపై పార్లమెంటుకే సర్వాధికారాలు వున్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి లోనుకావద్దని సూచించారు. సీఎం కిరణ్‌కాదు ఆయన తల్లో జేజమ్మ దిగివచ్చినా తెలంగాణ ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.
ఏం ఫరక్ పడదు




