హైదరాబాద్, డిసెంబర్ 31 (జనంసాక్షి) :
సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడుదామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. జనవరి 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధనదీక్ష చేపట్టనున్నట్లు కోదండరామ్ తెలిపారు. తెలంగాణ సాధనలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. మంగళవారం ఉదయం ఐకాస కార్యాలయం వద్ద కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ… శాసనసభ సజావుగా సాగేలా సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ చేసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణలు తేవాలని సూచించారు. జనవరి 5న దోమలగూడలోని ఏవీ కళాశాలలో తెలంగాణ న్యాయవాదుల సదస్సు నిర్వహించనున్నట్లు కోదండరామ్ తెలిపారు. ఇప్పటికే తాము రాష్ట్రపతిని కలసి వినత ఇపత్రం సమర్పించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ పాలనను ఒప్పుకోమని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లులో సంపూర్ణ తెలంగాణ కోసం అవసరమైన సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకే సంపూర్ణ తెలంగాణ ఆకాంక్షిస్తూ 7న ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షను చేపడతామని చెప్పారు. తాము నిర్వహించే మహాధర్నాకు పోలీసుల నుంచి అనుమతి కోరామని తెలిపారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరిగేందుకు, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలని కోదండరాం కోరారు. ఇన్నాళ్లు లేని ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా వస్తాయని ఆయన ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులను ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నీ రోజులు తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన సూచించారు. తెలంగాణ పక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణల కోసం తమ ఆందోళనలు కొనసాగుతునే ఉంటాయని కోదండరాం చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తమకు అందరూ సహకరించ తెలంగాణకు అనుకూలంగా నిలబడాలని అన్నారు. విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడుదాం : కోదండరామ్




