ఉద్యమాల్లో బలప్రయోగం జరక్కుండా చూశాం : డీజీపీ ప్రసాద్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 31 (జనంసాక్షి) :
మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. విభజన సందర్భంగా ఇరు ప్రాంతాల్లో గతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని డీజీపీ అన్నారు. 2009 నుంచి రాష్ట్రంలో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయని, తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలు, ఉద్యమాల సమయంలో పోలీసులు ఏ ప్రాంతవాసులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు వ్యవహరించారన్నారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన గతేడాది కాలంలో పోలీస్ శాఖ నిర్వహించిన బాధ్యతలను, రాష్ట్రంలో శాంతిభద్రతలను వివరించారు. రాష్ట్రంలో ఆందోళనల దృష్ట్యా భద్రతా చర్యలు పెంచినట్లు తెలిపారు. 95 కంపెనీల కేంద్ర పారామిలటరీ, 35 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు మోహిరించినట్లు పేర్కొన్నారు. నేరాల అదుపులో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పని చేశారని వివరించారు. ఉద్యమాల సమయంలో ఆందోళనలను ఆపగలిగాం. రాష్ట్రంలో ఆందోళనల దృష్ట్యా భద్రత చర్యలు పెంచాం. ఉద్యమాలు జరిగినప్పుడు 95 కంపెనీల కేంద్ర పారామిలటరీ, 35 కంపెనీల ఎపీఎస్పీ బలగాలు మోహరించాం’ అని తెలిపారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనలను శాంతియుతంగా అదుపుచేశామని తెలిపారు. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం గణనీయంగా తగ్గిందని డీజీపీ తెలిపారు. ఈ ఏడాదిలో 163 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశామని, మరో 76 మంది లొంగిపోయారని వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నివారించడానికి కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అణచి వేసేందుకు 531 కేసులు నమోదు చేసి 3,249 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదిలో 40,384 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, గతంతో పోలిస్తే 6.45 శాతం మేర రోడ్డు ప్రమాదాలు పెరిగాయని డీజీపీ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాల రూపంలో 123 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ ఏడాది 1435 అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే అత్యాచారం కేసులు 20.49 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 11420 చీటింగ్ కేసులు నమోదయినట్టు చెప్పారు. మహిళలకు వేధింపులపై 25,998 కేసులు నమోదు చేశామన్నారు. 2012తో పోలిస్తే మహిళలపై వేధింపుల కేసులు 15.11శాతం పెరిగినట్టు డీజీపీ తెలిపారు. పోలీసులు వ్యవహరించిన తీరును డీజీపీ ప్రశంసించారు. ఏడాది ముగుస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని శాంతిభద్రతల విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరును ఆయన వివరించారు. ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితుల్లో ఆందోళనకారులపై చర్యలు తీసుకునేప్పుడు ఎవరూ మరణించకపోవడం పోలీసుల ఘనత అని ఆయన అన్నారు.
మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం




