Monday, 2 November 2026

మరో వాగ్దానం నెరవేర్చే దిశగా ఢిల్లీ సర్కార్‌

కాగ్‌తో చర్చలు
సర్కారు పడిపోయిన పట్టించుకోను : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) :
ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చర్యలు చేపట్టారు. ఢిల్లీ పేదలకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ఆయన చర్చలు ప్రారంభించారు. ఈక్రమంలో ప్రభుత్వం పడిపోయిన పట్టించుకోనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెడుతుందో… లేదో తెలియదు కానీ తాను అనుకున్న లక్ష్యం నుంచి వైదొలిగేది లేదని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల్లో ఢిల్లీ ప్రజలకు చేయగలిగిందంతా చేస్తామని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ తెలిపారు. ప్రజల సమస్యను పరిష్కరించే క్రమంలో ప్రభుత్వం పడిపోయినా లెక్కచేయమన్నారు. డిస్కంలు ప్రారంభం నుంచి ఆడిట్‌కు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛార్జీలు తగ్గించాలని డిస్కంలను ఢిల్లీ ప్రభుత్వం కోరింది. ఉత్పత్తి వ్యాయం ఎక్కువగా ఉన్నందున ధరలు తగ్గించలేమని డిస్కంలు ప్రకటించాయి. మరోవైపు మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలను కాగ్‌ ఆడిట్‌ చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. గత 11 ఏళ్లనుంచి విద్యుత్‌ కంపెనీల లెక్కల్ని ఆడిట్‌ చేయమని కేజీవ్రాల్‌ కోరినట్లు కాగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. అందుకు గాను ఒక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు కూడా వారు తెలిపారు. మరోపక్క విద్యుత్తు కంపెనీలు మాత్రం కాగ్‌కి ఆ అధికారం లేదంటున్నాయి. ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఈరోజు సాయంత్రం కాగ్‌ శశికాంత్‌ శర్మను కలిశారు. ఆడిట్‌ సాధ్యమేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *