సీఎం చర్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది : జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 1 (జనంసాక్షి) :
రాజ్యాంగ ప్రక్రియను శాఖ మార్పు ద్వారా అడ్డుకోలేరని, ప్రస్తుతం అలాంటి కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. బిల్లు పక్రియను హైజాక్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన కాల చక్రాన్ని ఆపే కార్యక్రమాలు మంచివి కావని, శాసనసభలో చర్చించకుండా శాఖ మార్చడం పక్రియను పక్కదారి పట్టించడమేనన్నారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పుపై ఆయన పరోక్షంగా స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం అన్నీ అనుకుని చివరకు నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పుడు దానిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగౄణ ఆకాంక్ష ఈనాటిది కాదన్నారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హావిూ మేరకు ప్రక్రియ సాగుతున్న తరుణంలో ఇలా చేయడం సరికాదన్నారు. జనవరి 23 రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బిల్లు అసెంబ్లీ చేతిలో ఉండదని, పార్లమెంటుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. చర్చలో పాల్గొని అవకాశాలన్నీ వినియోగించుకోవాలని ఇరుప్రాంత నేతలను కోరుతున్నానన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగానే ఆత్మనిగ్రహం పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బిల్లులో రాజ్యాంగ పరమైన లోపాలుంటే కోర్టులకు వెళ్లవచ్చన్నారు. విడిపోతున్న సమయంలో మనస్పర్థలు పెంచడం మంచిది కాదని, ఎత్తులకు పైఎత్తులు వేయడం మానుకోవాలని జైపాల్‌రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతలు పట్టుదలకు పోకుండా తమ ప్రాంత అభివృద్ధికి కలసి రావాలన్నారు.
రాజ్యాంగ ప్రక్రియను శాఖ మార్పు ద్వారా అడ్డుకోలేరు




