హైదరాబాద్, జనవరి 1 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య హత్యకు నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ (మావోయిస్టు) ఎన్‌టీఎస్‌జెడ్సీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఈమేరకు ఆయన పత్రికా కార్యాలయాలకు ఒక లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృహాత్మకంగానే డిసెంబర్ 24న రాత్రి హైదరాబాద్‌లో టిప్పర్ ప్రమాదం ముసుగులో ఆకుల భూమయ్యను హత్య చేశారని ఆయన ఆరోపించారు. నాటకమైన టిప్పర్ ప్రమాద ముసుగు హత్యను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ముసుగుహత్యకు నిరసనగా జనవరి 3న తెలంగాణ వ్యాప్తంగా బంద్‌ను పాటించాలని ఎన్.టి.ఎస్.జెడ్.సి పిలుపునిస్తోందని తెలిపారు. దేశ ప్రయోజనాలను సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టిన భారత పాలక వర్గాలు, తమ లక్ష్యాన్ని నిరాటంకంగా కొనసాగించడం కోసం దేశవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా విప్లవోద్యమంపై, ప్రజా ఉద్యామాలపై తీవ్రమైన అణచివేతను ప్రయోగిస్తున్న విషయం అందరికీ తెలిసినదని పేర్కొన్నారు. విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక ఉద్యమాల సుసంపన్న వారసత్వాన్ని కలిగివున్న ఆంధ్రప్రదేశ్‌ను తమ అణచివేతకు ప్రయోగశాలగా ఎన్నుకోని, సిపిఐ (మావోయిస్టు) న్యాయకత్వంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ కొనసాగుతున్న విప్లవోద్యమన్ని అణచివేయడంలో విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేశామని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నాయని, ఇది తాత్కాలికమేనని పాలకవర్గాలకు స్పష్టంగా తెలుసని ఆయన స్పష్టం చేశారు. సుసంపన్నమైన పోరాట వారసత్వమున్న తెలంగాణ గడ్డ నుంచి విప్లవోద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యం కాదని, ఏ మాత్రం ఉపేక్షించినా అక్కడ దావానలం చెలరేగుతుందని పాలకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు నెలల క్రితం జూలై 4న నెల్లురులో దుండగుల ముసుగులో ప్రభుత్వం గంటి ప్రసాదంను హత్య చేయించిందని, ఇప్పుడు టిప్పర్ ప్రమాదం రూపంలో ఆకుల భూమయ్య హత్య చేసిందని ఆరోపించారు. రోజు రోజుకు పెరుగుతున్న పాలకవర్గాల ఫాసిజానికి ఇదో ఉదాహరణగా అభివర్ణించారు. తెలంగాణవాదులు శుక్రవారం బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భూమయ్య హత్యకు నిరసనగా రేపు తెలంగాణ బంద్




