Tuesday, 3 November 2026

నువ్వైతే గాలిమోటర్లరా.. గాల్లోనే పేల్చేస్తాం

సీఎంపై పొన్నం ఆర్‌పార్‌

కరీంనగర్‌, జనవరి 2 (జనంసాక్షి) :

నువ్వైతే గాలిమోటర్లరా.. దాన్ని గాల్లోనే పేల్చేస్తామని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే కరీంనగర్‌ జిల్లాకు వస్తానంటే ఆయన హెలీకాప్టర్‌ను గాలిలోనే తుపాకులతో పేల్చేస్తామని పొన్నం తీవ్రస్థాయిలో పేర్కొన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన కిరణ్‌ను కచ్చితంగా అడ్డుకుని తీరుతామన్నారు. తమదాకా అసలు తెలంగాణ పోలీసు బిడ్డలే చేసిపెడతారన్నారు. కిరణ్‌ హెలికాప్టర్‌ను దిగకుండా వారే అడ్డుకుంటారన్నారు. సీఎం శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశం కానుండడం ఇందులో కేవలం తెలంగాణ బిల్లుపైనే చర్చ జరుగాల్సి ఉన్నసమయంలో శాసనసభా వ్యవహారాల శాఖను జి ల్లాకుచెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి తొలగించడం సిఎం మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. దానివల్ల ఒరిగే లాభం ఏమి లేదన్నారు. కేవలం ఆయన పైశాచికానందానికి గురి కావడానికి దోహద పడుతుందన్నారు. అసలు తెలంగాణను అడ్డుకునేదిగాని ఓటింగ్‌ జరిపి ఓడించడం అనేది కేవలం తాత్కాలికమేనన్నారు. 23వ తేదీ రాత్రి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈబిల్లు అంశం  కేవలం పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రలు జైపాల్‌రెడ్డి, జైరాం రమేశ్‌ స్పష్టం చేశారన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా చేయాల్సినవసరం లేదన్నారు. ఆయనకు జిల్లాకు చెందిన ప్రతిఒక్క నాయకుడు పార్టీలు కూడా అండగా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా వెన్నంటే ఉన్నారన్నారు. ఈ తరుణంలో రాజీనామా చేయాల్సినవసరం లేదని మంత్రి వెనక్కి తగ్గి ఈనెల 23వరకు ఓపికగా ఉండాలని ప్రభాకర్‌ సూచించారు. అవసరమైతే 23 తర్వాత తెలంగాణకు చెందిన మంత్రులంతా కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని పొన్నం సూచించారు. తెలంగాణ బిల్లుపై శుక్రవారం నుంచి అసెంబ్లీలో చర్చ జరుగనున్న సందర్భంగా తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండి ముఖ్యమంత్రికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *