రాహులే తర్వాతి ప్రధాని
చివరి వరకూ సంస్కరణలు కొనసాగిస్తా : ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (జనంసాక్షి) :
మోడీ దేశానికి ప్రమాదకరమని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. రాహుల్‌గాంధీయే తర్వాతి ప్రధాని అని మన్మోహన్ సంకేతాలిచ్చారు. పదేళ్ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా శుక్రవారం ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. యూపీఏ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూనే, రాహుల్ తదుపరి ప్రధాని అని సంకేతాలు ఇచ్చారు. ఊహించినట్లుగానే యూపీఏ ప్రభుత్వ విజయాలను వల్లెవేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో సమావేశం ప్రారంభించిన ప్రధాని మన్మోహన్సింగ్ భారత అభివృద్ధి తిరిగి పట్టాలపైకి వస్తోందన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత బాధ్యతలను కొత్త ప్రధానికి అప్పగిస్తానన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నానని, పార్టీ యువ నాయకత్వం కొత్త తరం ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. అలాగే తదుపరి ప్రధాని ఎవరన్నది సరైన సమయంలో కాంగ్రెస్ ప్రకటిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెబుతూనే రాహుల్ సమర్థుడైన వ్యక్తి అని తెలిపారు. రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడు, ఆయన విషయంలో పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. సాధారణ ఎన్నికల అనంతరం యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్లో మన్మోహన్ పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మోడీ నాయకత్వంపైనా మండిపడ్డారు. దేశం గుజరాత్ తరహా మారణ¬మాన్ని కోరుకోవడం లేదన్నారు. ఇదే దశలో ఆయన యూపీఏ సాధించిన విజయాలను వివరించారు. తమ ప్రభుత్వం అనేక చారిత్రక చట్టాలను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. రాజీనామా చేయాలని ఎప్పుడు అనిపించలేదని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నుంచి తనకు అనూహ్య మద్దతు లభించిందన్నారు. యూపీఏ- 3 ప్రభుత్వం గురించి ఇప్పుడే మాట్లాడడం అసంగతమన్నారు. గ్రావిూణ ప్రాంతాలు, నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. ధరల పెరుగుదల ప్రజలను కాంగ్రెస్‌కు దూరం చేసిందన్నారు. ధరాభారం నుంచి పేదలను కాపాడేందుకు కృషి చేశామన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందన్నారు. గ్రావిూణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాధాన్యంగా దృష్టి సారించామని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని విపులంగా చెప్పేందుకు ఇప్పుడు సమయం తక్కువగా ఉందన్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం వినాశకరపరిణామంగా భావిస్తానని మన్మోహన్ అన్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండ మళ్లీ దేశంలో జరగాలని కోరుకోవడం లేదన్నారు. ఇప్పుడున్న విూడియాతో పోలిస్తే చరిత్రకారులు తన పట్ల సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రావిూణ వికాసానికి యూపీయే సర్కార్ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తెలిపారు. రైతులకు మద్దతు ధరలను కల్పించడంలో, రుణాల విషయంలో ఎన్నో చేశామన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో విద్యుత్ , రోడ్ల విషయంలో గణనీయ అభివృద్ధి సాధించామన్నారు. ఆర్థిక అవరోధాలను తట్టుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశంలో పేదరికం పదేళ్లుగా తగ్గుతూ వస్తోందన్నారు. సర్వశిక్ష అభియాన్, స్కాలర్‌షిప్‌లతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చామన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయ వృద్ధి రేటు పెరిగిందని తెలిపారు. నిత్యావసరాల ధరలు నియంత్రించేదుకు చర్యలు తీసుకున్నాం, ఫుడ్ సెక్యురిటీ యాక్ట్‌తో ఆహార భద్రత కల్పించామన్నారు. కేంద్రం చర్యలతో ప్రజల ఆదాయాలు భారీగా పెరిగాయన్నారు. . పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.స్పెక్టమ్ర్, కోల్ కేటాయింపుల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం, గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ రంగంలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. సవాళ్లను దేశ ప్రజలు తట్టుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతున్నామని పేర్కొన్నారు. న్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోంది. తొమ్మిదేళ్లలో ఆర్థికంగా భారత్ అభివృద్ధి సాధించిందన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనని ప్రధాని మన్మోహన్సింగ్ స్పష్టం చేశారు. కొత్త తరం నాయకులు జాతిని మరింత సమర్థవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే జాతికి తీవ్ర నష్టమని ప్రధాని అభిప్రాయపడ్డారు. గుజరాత్లో జరిగిన మారణ¬మం దేశంలో జరగాలనుకోవడం లేదని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనంనుంచి బయటపడుతున్నాయని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో నడుస్తున్నాయని తెలిపారు. ఓటరు చైతన్యం కూడా పెరిగిందని, ఇటీవలి ఫలితాలు దాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం తగ్గుతోందని, వేతనాల్లోనూ సారూపత్య వస్తోందని, ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవయాభివృద్ధి జరిగిందని, ఫలితంగా గ్రామీణ ఆదాయాల్లో ఘనణీయమైన వృద్ధి సాధ్యమైందని చెప్పారు. అమెరికాతో వ్యూహాత్మకమైన చర్చలు కొనసాగించామని తెలిపారు. యూపీఏ -3 గురించి ఇప్పుడే మాట్లాడటం భావ్యం కాదని, తన కుటుంబ సభ్యులెవరూ అవినీతికి పాల్పడలేదని ప్రధాని పేర్కొన్నారు. ధరల పెరుగుదల కాంగ్రెస్‌కు ప్రజలను దూరం చేసిందని, కొన్ని సందర్భాల్లో ధరలు నియంత్రణ లేకుండా పెరిగిపోయాయని తెలిపారు. అందుకే ఆహార భద్రత బిల్లు తీసుకువచ్చామని వివరించారు.
మోడీ దేశానికి ప్రమాదం




