అడ్డుకుంటున్న సీమాంధ్రులు
హైదరాబాద్, జనవరి 3 (జనంసాక్షి) :
శాసనసభ, మండలిలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చ సాగలేదు. శాసన సభలో రాష్ట్ర పునర్వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ జరగాలనే అందరూ కోరుకున్నారు. కానీ సభ లోపల మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. గందరగోళం మధ్య ఉభయసభలు శనివారానికి వాయిదా పడ్డాయి. ఉదయం ప్రారంభమైన శాసనసభ సమావేశం ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా పడింది. శాసనమండలిలోనూ అదే తంతు కొనసాగింది. ఉభయసభల సమావేశాలూ రేపటికి వాయిదా పడ్డాయి. తొలుత సభ ప్రారంభం అయినప్పుడు ందరగోళం కారణంగా అరగంట వాయిదా పడింది. తొలుత వాయిదా పడి మళ్లీ ప్రారంభం అయ్యాక అదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో సభ్యుల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండో సారి వాయిదా అనంతరం సభ ప్రారంభమైన వెంటనే ఇరుప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.శాసనసభ సమావేశాలు ప్రారంభం నుంచే వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతలోనే ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చట్టుముట్టి ఆందోళనకు దిగడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు మళ్లీ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. విభజన బిల్లుపై చర్చించాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో స్పీకర్ సభను మళ్లీ గంటపాటు వాయిదా వేశారు. సభలో సభ్యుల హాజరు కూడా తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభకు హాజరయ్యారు. మూడోసారి సభ సమావేశం కాగానే పరిస్థితి పునరావృతమైంది. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.శాసనసభలో సీఎం కిరణ్ వైఖరిపై తెరాస మండిపడింది. రాజ్యాంగ పక్రియను అడ్డుకున్న మొట్టమెదటి ద్రోహి సీఎం కిరణ్ అని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. సీఎం, స్పీకర్లు శాసనసభ సంప్రదాయాలను కాపాడాలని కోరారు. ఇందిరా పార్కు వద్ద సీమాంధ్ర ఎంపీలు చేపట్టిన సంకల్పదీక్షపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఇదిలావుంటే తెలంగాణ బిల్లుపై తెలంగాణ వారికే అభ్యంతరాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. అలాంటప్పుడు తమకు అసలు బిల్లుపైనే నమ్మకం లేదన్నారు. దానిని తిప్పి పంపాలన్నదే తమ డిమాండ్ అన్నారు. సమైక్యంలోనే న్యూ ఇయర్ వేడుకలు వచ్చే ఏడాది(2015) కూడా సమైక్య రాష్ట్రంలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటామని రాజకుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రపై సభలో చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు శాసనసభ రెండోవిడత సమావేశాలు శుక్రవారం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ చైర్లోకి వస్తూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే అప్పటికే సీమాంధ్రులు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని తీర్మాణం చేయాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లుపై చర్చించాలని డిమండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. తీవ్ర నినాదాలతో ¬రెత్తింది. ఈనిరసనల మద్యే స్పీకర్ ప్రతిపక్షాలిచ్చిన వాయిదా తీర్మాణాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో స్పీకర్ ఎంత సర్దిచెప్పినా వినక పోవడంతో రెండు నిమిషాలకే సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెల్లిపోయారు. అయినా కూడా ఆందోళన చేస్తున్న ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు పోడియం వద్దే భైఠాయించారు. సమావేశాల్లో తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ తెలుగుదేశం పార్టీ, సమైక్య తీర్మానం కోరుతూ వైసిపిలు వాయిదా తీర్మాణాలిచ్చాయి. వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ మనోహర్ ప్రకటించారు.
సాగని చర్చ




