కాదంటే చైర్‌ను అవమానపరిచినట్టే : శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందని, సీమాంధ్రులు కాదంటే స్పీకర్ చైర్‌ను అవమాన పరిచినట్లేనని మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తన శాఖను మార్చడం ఇందులో భాగమని ఆయన సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. ఇక్కడ తనకు మంత్రి పదవి మంచిది లేదా చెడ్డది ఇచ్చారా అన్నది ముఖ్యం కాదన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చర్చ ప్రారంభమయ్యాక కూడా కాలేదన్న రీతిలో, తమ ఇష్టాను సారం అసెంబ్లీని నడపాలన్న దురుద్దేశ్యంతో తన పదవిని మార్చారని అన్నారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదన్నారు. అందుకే తాను రాజీనామా చేశానన్నారు. కొందరు సీమాంధ్ర నేతల స్వార్థం కోసం నా ఫోర్టు ఫోలియాను ముఖ్యమంత్రి కిరణ్ మార్చారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మినిష్టర్స్ క్వార్టర్స్‌లో శ్రీధర్‌బాబు విూడియాతో మాట్లాడారు. బిల్లును ఆపే కుటిల యత్నంలో భాగంగానే నా శాఖను మార్చారని తెలిపారు. బిల్లుపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో శాఖ మార్పు సీమాంధ్ర నాయకుల కుట్రలను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కీలక సమయంలో ఈ ప్రయత్నం అధికార దుర్వినియోగమేని పేర్కొన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ ప్రారంభమైందని, డిప్యూటీ స్పీకర్ చర్చకు అనుమతిని ఇచ్చారని అన్నారు. తాను సభా వ్యవహారాల మంత్రిగా నిబంధనలకు అనుగుణంగానే పనిచేశానని అన్నారు. శాఖను తప్పించడం అన్న చర్య తెలంగాణ పౌరుల హక్కులను హరించడమేన్నారు. ఇకపై తెలంగాణను అడ్డుకునే వ్యక్తులు, వ్యవస్థపైనే ఎప్పటీకీ మా తిరుగుబాటు ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవమే ప్రధానంగా తాను పదవిని త్యజించానన్నారు. వ్యతకిగతం కోసమే అయితే ఎన్నోసార్లు పదవికి రాజీనీమా చేయాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం ముందు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు రాజీనామా చేయలేదని తెలిపారు. బిల్లుపై చర్చ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్న సమయంలో ఇటువంటి కవ్వింపు చర్యలు సరికాదన్నారు. ఎవరు అడ్డుకున్నా, ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా తెలంగాణ ఏర్పాటు ఆగదని తెలిపారు. ముఖ్యమంత్రికి నా రాజీనామా లేఖను పంపాను, నా రాజీనామా వారించిన వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సీఎం చర్యలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు నాకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతలన్నారు. కేవలం బిల్లును ఆపుదామనే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి తన శాఖ మార్చారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధిస్టానం ముఖ్యంగా సోనియాగాంధీ 60 ఏళ్ల తెలంగౄణ పోరాటాన్ని గమనించి ఓ నిర్ణయం తీసుకుంటే దానిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేంద్రంలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా ఆపుతారని అన్నారు. ఇక్కడ ఆపడం వల్ల తెలంగాణ ఆగదని తెలిసినా కావాలనే అడ్డుకోవడం స్వార్థం కాక మరోటి కాదన్నారు. ఈ విసయంలో ఎన్నోమార్లు తాను, తనతోటి సహచరులు సిఎంను కలసి ప్రక్రియకు అడ్డుపరాదని చెప్పామన్నారు. అయినా కాంగ్రెస్ అధిస్టాన్నాన్ని ధిక్కరించే చర్యలుకు ఉపక్రమించడం ఎతవరకు సమంజసమన్నారు. అందుకే తాను స్వార్థం కోసం రాజీనామా చేయలేదని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నానికి నిరసనగా రాజీనామా చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులంతా రాజీనామా వద్దని వారించారన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు గుర్తించక పోవడం దారుణమన్నారు. దాదాపు 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నా వారికి కనీసం సంతాపం తెలపలేకపోయామని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియ ఆగదని శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును ఆపుదామనే ప్రయత్నంలోనే తన శాఖ మార్చారని గుర్తించాక ఇక ఉండకూడదని నిర్ణయించుకున్నాని మంత్రి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు పక్రియ ఆగదన్నారు. తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలు, వ్యక్తులపై తిరుగుబాటు కొనసాగుతుందన్నారు. తాను పదవులు కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నందునే మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ఇదంతా చేశారన్నారు. ఇది మూమ్మాటికీ అధికార దుర్వినియోగమే అన్నారు. తన రాజీనామాతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ముందు తన రాజీనామా చాలా చిన్నదన్నారు. ఎన్నో అవమానాలను భరిస్తూ ఇంతకాలం పార్టీకోసం పనిచేశామన్నారు. తాను కేవలం సీమాంద్రుల కవ్వింపు చర్యలకు నిరసనగానే రాజీనామా చేయడం జరిగిందన్నారు. ఇందులో తనకేం స్వార్థ ఆలోచన లేనేలేదన్నారు. శాసనసభా వ్యవహారాలను గడిచిన మూడేళ్లుగా ఏవిదంగా వ్యవహరించానో ఆవిధంగానే తెలంగాణా బిల్లు విషయంలో కూడా ప్రవర్తించానన్నారు. సిఎం కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడని శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని తాను పదవులకోసం ఏనాడు ప్రాకులాడలేదన్నారు. సిఎం సహా సీమాంద్రులంతా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనన్నారు. బిల్లును ఆపుతాననుకోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణా ప్రజల మనోభావాలను తుంగలో తొక్కినప్పుడు ఎందుకు ఈపదవిలో కొనసాగాలనిపించే తాను రాజీనామా చేశానన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలను ప్రత్యేక రాష్ట్ర వాంచను గుర్తించక పోవడం దారుణమన్నారు. ఎన్నోఏళ్లుగా పార్టీలో ఉన్నాం మా మాట వినడంలేదని గొంతు చించుకుంటున్న వారు సిడబ్ల్యూసికి ముందే సమావేశం ఏర్పాటు చేసి ప్రశ్నిస్తే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పలేదా అన్నారు. మాట తప్పే నీచ సంస్కృతి తెలంగాణా వారికి లేనే లేదన్నారు. తనశాఖను మార్తి సీమాంద్ర నాయకులు చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలు చేసుకున్నారని ఆరోపించారు. కీలకసమయంలో ఈప్రయత్నం అధికార దుర్వినియోగమే అవుతుందన్నారు.ఈచర్య తెలంగాణా పౌరుల హక్కులను హరించడమే అవుతుందన్నారు. తెలంగాణా ఆత్మగౌరవం ముందు మంత్రి పదవి ముఖ్యం కానేకాదన్నారు. తన రాజీనామాను వద్దని వారించిన సీనియర్ మంత్రులకు, పార్టీ తెలంగాణా నేతలకు శ్రీదర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో చర్చ ఎప్పుడో ప్రారంభమైందన్నారు. చర్చ ప్రారంభం కాలేదనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సిఎం అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలన్నారు.ఇంకా కూడా తెలంగాణాపై ఆధిపత్యం కొనసాగించాలని చూడడం సీమాంద్రుల దుర్మార్గానికి నిదర్శనమని శ్రీదర్‌బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణాను అడ్డుకునే శక్తి యుక్తులు సీమాంధ్రకు చెందిన నాయకుల్లో ఏ ఒక్కరికి కూడా లేవన్నారు. తెలంగాణవాదులను, మంత్రులను, ప్రజలను ఎన్నోసార్లు సీఎం కించ పరుస్తూనే వస్తున్నారని ఆరోపించారు. అయినా అధిష్టానం మొహం చూసి ఇంతకాలం ఓపికపడుతూ వచ్చామన్నారు. రాజీనామా ఉపసంహరించుకునే పరిస్థితి అసలు రానేరాదన్నారు. తాను ప్రస్తుతం హాయిగా ఉన్నానన్నారు. సీమాంద్రకు చెందిన సిఎం కిరణ్ మిత్రుడిగా నమ్మిస్తూనే తడిగుడ్డతో గొంతు కోసేందుకు ప్రయత్నించాడని విమర్శించారు. మంత్రి పదవి తన కాలిగోటితోనే సమానం అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, రాష్ట్ర గిడ్డంగులశాఖ డైరెక్టర్ కోమటిరెడ్డి నరెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సభలో చర్చ మొదలైంది




