సాంకేతిక అంతరం తగ్గించాలి
ప్రధాని మన్మోహన్
తిరువనంతపురం, జనవరి 4 (జనంసాక్షి) :
ఎలక్ట్రానిక్ అక్షరాస్యత సాధించాలని, సాంకేతిక అంతరం (డిజిటల్ డివైడ్) తగ్గించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. అక్షరాస్యతలో వందశాతానికి చేరువైన కేరళ ఇ-అక్షరాస్యత కూడా సంపూర్ణంగా సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. శనివారం తిరువనంతపురంలో ఇ-అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ప్రస్తుత వికేంద్రీకరణ పాలనాయుగంలో సేవల అందజేతకు సాంకేతిక అక్షరాస్యత ఎంతో అవసరమని తెలిపారు. కేరళ నుంచి మిగతా రాష్ట్రాలు స్ఫూర్తి పొందాలని అన్నారు. రాష్ట్రంలో 33 నెలల్లో పూర్తి ఇ-అక్షరాస్యత సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వుమెన్ చాందీ తెలిపారు. కేరళ రాష్ట్ర కేబినెట్ సమావేశాని ప్రధాని మన్మోహన్ హాజరయ్యారు. యూడీఎఫ్ ప్రభుత్వ సమస్యలను ఈ సందర్భంగా ప్రధానికి ఏకరువుపెట్టింది. 12 అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని సీఎం వుమెన్‌చాందీ ప్రధాని మన్మోహన్‌కు అందజేశారు. అనంతరం ప్రధాని మన్మోహన్‌సింగ్ కోచీలోని పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ను జాతికి అంకితం చేశారు. కోచిలోని పుత్తవైపే వద్ద రూ.4,200 కోట్లతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు.
ఇ-అక్షరాస్యత సాధించాలి




