తిరుమల, జనవరి 6 (జనంసాక్షి) :
శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకునే వారు సంప్రదాయాల ఊబిలో ఎంతగా కూరుకుపోయారో ఇస్రో చైర్మన్‌ను చూస్తే తేలిపోతుంది. ఖండాంతరాలు దాటి రోదసీలోకి క్షిపణులు పంపే ఆయన సాధారణ గ్రామీణుడి మాదిరి పూజల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ సోమవారం దర్శించుకుచి జీఎస్‌ఎల్‌వీ డీ-5 అయినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలిపుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాధాకృష్ణన్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ డీ-5 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రయోగానికి ముందు తరవాత ఆయన శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాధాకృష్ణన్‌కు స్వామి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
థ్యాంక్ గాడ్! శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్




