Tuesday, 3 November 2026

జస్టిస్‌ గంగూలీ రాజీనామా ఆమోదం

సంచలన తీర్పుల పర్యవసానమే ఇది
పోగొట్టుకున్న పరువు తిరిగి సంపాదించుకుంటా
కుట్రతో ఆడిన నాటకం : జస్టిస్‌ గంగూలీ
కోల్‌కత, జనవరి 7 (జనంసాక్షి) :
న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గంగూలీ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర మానవహక్కుల సంఘం చైర్మన్‌ పదవికి సమర్పించిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎంకే నారాయణన్‌ ఆమోదించారు. ఆరోపణలపై ఒత్తిడి పెరగడంతో గంగూలీ సోమవారం హెచ్‌ఆర్సీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన రాజీనామా ఆమోదిస్తూ రాజ్‌భవన్‌ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. రాజీనామా అనంతరం గంగూలీ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు. తాను ఇచ్చిన సంచలన తీర్పుల పర్యవసానమే ఈ ఆరోపణలని ఆయన స్పష్టం చేశారు. పోగొట్టుకున్న పరనువును ఎలాగైనా తిరిగి సంపాదించుకుంటానని ఆయన తెలిపారు. కుట్రతో ఆడిన నాటకానికి తాను బలయ్యాయనని ఆయన తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిని ద్వేషించడం లేదని, వారి జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. గౌరవాభిమానాలతో పనిచేసే పరిస్థితి లేనప్పుడు పదవిలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేశానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *