Tuesday, 3 November 2026

ప్రాధాన్యం లేదన్న కాంగ్రెస్‌ వర్గాలు
న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతల సమావేశానికి ప్రియాంక హాజరయ్యారు. మంగళవారం ఢిల్లీలోని రాహుల్‌ నివాసంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ఆమె రాహుల్‌గాంధీతో సహా వచ్చారు. దీంతో ఆమెను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రమోట్‌ చేస్తుందా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ముఖ్య నాయకుల సమావేశానికి ప్రియాంక హాజరుకావడానికి అంతగా ప్రాధాన్యం లేదని కాంగ్రెస్‌ వర్గాలు కొట్టిపారేశాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్నట్లుగా ఊహాగనాలు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి దీటైనా ప్రత్యర్థి కోసం కాంగ్రెస్‌ అంతకు మించిన వేగంతో వ్యూహరచన చేస్తోంది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రా కూడా హాజరయ్యారు. ఈనెల 17 నుంచి ఏఐసీసీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని పదవిపై అంతగా ఆసక్తి చూపని రాహుల్‌ తన సోదరి ప్రియాంకను 2014 ఎన్నికల్లో ప్రధాని పదవికి అభ్యర్థిగా ప్రకటించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆమెను అభ్యర్థిగా ప్రకటిస్తే మోడీని నిలువరించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రియాంకను కాంగ్రెస్‌ తురుపు ముక్కగ భావిస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత మార్పులపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాహుల్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక హాజరవడంతో ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా, 2014 ఎన్నికలలో ప్రియాంక పోటీ చేయరని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఆమె పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాలలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ పోటీ చేస్తారు. ఆ స్థానాలను ఆమె దగ్గర నుంచి పర్యవేక్షిస్తారు. ఏఐసిసి సమావేశాలకు ముందే పార్టీలో అంతర్గత మార్పులుంటాయంటాయని తెలుస్తోంది. అయితే ఆమెను ఎంపీగా పోటీ చేయించే ఆలోచన ఉందని అంటున్నారు. రాహుల్‌ చొరవ తీసుకుని ఆమెతో పోటీ చేయించడమే గాకుండా ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *