Tuesday, 3 November 2026

డీజీపీ ముందు లొంగిపోయిన ఉసెండీ

హైదరాబాద్‌,జనవరి 9 (జనంసాక్షి) :
మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండీ ఉరఫ్‌ గుమడవెల్లి వెంకటకృష్ణప్రసాద్‌ గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన భార్య మార్కం సంతోషితో సహా డీజీపీ డీజీపీ ప్రసాదరావు వద్ద లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు లొంగిపోయే అవకాశాలున్నాయని తెలిపారు. వరంగల్‌ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన ఉసెండీ (53)పై 20 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో హతమార్చడం, పేలుడు పదార్థాలతో పాఠశాల భవనాలను ధ్వంసం చేయడంలాంటి మావోయిస్టుల చర్యలతో ఆయన విభేదించారని ఆరోగ్యం సహకరించకపోవడంతో భార్యతో సమా పోలీసులకు లొంగిపోయినట్లు వివరించారు. తాను అనారోగ్య కారణాలతో లొంగిపోయానని మావోయిస్టు నేత ఉసెండి తెలిపారు. మావోయిస్టు పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. తనను పార్టీ కేడర్‌ నుంచి ఎవరూ తప్పించలేదని చెప్పారు. కేంద్ర కమిటీకి సమాచారం అందించి లొంగిపోయానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవచేస్తానన్నారు. మావోయిస్టు అగ్రనేత ఉసెండీ దంపతులను డీజీపీ ప్రసాద్‌రావు విూడియా ముందు గురువారం ప్రవేశపెట్టారు. 1986లో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరిన ఉసెండీ ప్రస్తుతం సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న కేశవరావుకు కొరియర్‌గా పనిచేశారు. అదే సమయంలో అరెస్టయ్యాడు. 87లో బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరి తాండవ దళంలో సభ్యుడిగా పనిచేశారు. అనంతరం భాగళ్‌ఘాట్‌ దళానికి మారాడు. 1990 నుంచి 93 వరకు ఆ దళంలోనే ఉన్నాడు. ఆ తర్వాత పార్టీ మేగజైన్‌ ప్రభాత్‌ నిర్వహణ కోసం దండకార్యణానికి వెళ్లారు. అక్కడ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2006 నుంచి 09 వరకు పార్టీ ప్రచార బృందంలో సభ్యుడిగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *