హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యానికి చోటివ్వబోమని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆంధప్రదేశ్ పునర్‌వ్యవ్థసీకరణ బిల్లు వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశ పెడతామని షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై రాష్ట్రపతి 23 వరకు గడువు ఇచ్చారని అన్నారు. అది అక్కడ చర్చించాక తిరిగి రాష్ట్రపతికి వస్తుందన్నారు. తెలంగాణ బిల్లును ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రపతి నుంచి బిల్లు తమకు చేరిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని తెలిపారు. సమయం సరిపోతుందా అన్న ప్రశ్నకు చూద్దామంటూ ఆయన సమాధానం దాటవేశారు. మొదట బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ బిల్లు పంపేందుకు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రపతి జనవరి 23 వరకు సమయం ఇచ్చారని గుర్తు చేశారు. మావోయిస్ట్ నేత గుడ్సా ఉసెండి లొంగుబాటును స్వాగతిస్తున్నామన్నారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. తమకున్న సమాచారం ప్రకారం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడని షిండే తెలిపారు. విచారణ ఎదుర్కొకోకుండా కేసులు ఎదుర్కొంటున్న వారి విషయంతో రాష్టాల్రు సవిూక్ష కమిటీలు వేయాలని సూచించారు. తొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నారు.
నో లేట్ బిల్లు రాగానే పార్లమెంట్‌కు




