న్యూఢిల్లీ, జనవరి 10 (జనంసాక్షి) :
అమెరికా అత్యుత్సాహంతో అరెస్టు చేసి నానా ఇబ్బందులకు గురిచేసి భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే శుక్రవారం భారత్‌కు చేరుకున్నారు. అమెరికాలో అవమానకర పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఆమె అమెరికాలో ఉండే అవకాశం వచ్చినా నిరాకరించారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించిన అధికారులపై న్యాయపరమైన పోరాటం చేయాలని తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ఈ విషయాల్ని వెల్లడించారు. ఈ వివాదంపై భారతీయ కోర్టులోనే న్యాయ పోరాటం చేయనున్నట్లు తెలిపారు.1999 బ్యాచ్‌కు చెందిన ఐఎప్ఎస్ అధికారి దేవయాని వీసా నిబంధనల్ని అతిక్రమించినట్లు అభియోగాల్ని మోపారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడంతో పాటు పూర్తిగా దుస్తులు విప్పి తనిఖీ చేశారని వెలుగులోకి రావడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్త మయ్యాయి. దేవయాని ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయ ల్దేరారు. అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్‌లో అరెస్ట యినపుడు భారత్ తరపున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్‌కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తి చేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయ వాదులు తెలిపారు.మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మద్య ఉన్న హెడ్‌క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూ రయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. అని ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమి తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌కు చేరిన దేవయాని




