ముంబయి, జనవరి 13 (జనంసాక్షి) :
సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి తమ ‘పూర్తి’ మద్దతు ప్రకటించారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఆ పార్టీ అవినీతిపై పోరాటాన్ని తన అజెండాలో చేర్చుకుంది. అదే సమయంలో ఆదర్శ్ (హౌసింగ్ కుంభకోణం), లవస ద్వారా మేం అవినీతిపై పోరాడుతున్నాం’ అని పాట్కర్ సోమవారం ఇక్కడ విలేకరులతో అన్నారు. ‘వారి (ఆప్) పత్రాలను మేం అధ్యయనం చేశాం మైక్రో నుంచి మ్యాక్రో ఎకనమిక్ వ్యూ పాయింట్ అనేది కొద్దో గొప్పో వాటిలో ప్రతిబింబించింది. వారితో చర్చలు కొనసాగిస్తాం. కేవలం మానిఫెస్టోలో మాత్రమే కాక వారి పని సంస్కృతి, వారు పనిచేస్తున్న పత్రాల్లో మా అభిప్రాయాలు ప్రతిఫలించేలా మా సేవలు అందిస్తా” అని 59 ఏళ్ళ సామాజిక కార్యకర్త వివరించారు. ఈ నెల 16,17 తేదీల్లో ఏఏపీ సీనియర్ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో తాను పోషించే పాత్ర గురించి భవిష్యత్ కార్యాచరణకు ప్రకటిస్తాననిక మేధా పాట్కర్ తెలిపారు. పాట్కర్ నుంచి మద్దతును ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మయాంక్ గాంధీ, అంజలి దమానియా స్వాగతించారు.
ఆప్‌కు మేధాపాట్కర్ మద్దతు




