లక్నో, జనవరి 15 (జనంసాక్షి) :
రానున్న 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతామని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. తాము ఎవరితోనూ పొత్తులు కుదుర్చుకోబోమని ఆమె తేల్చిచెప్పారు. ఈ నిర్ణయంతో తృతీయ ప్రత్యమ్నాయంలో మాయ చేరరన్న విషయం కూడా స్పష్టమయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ సావ్‌ధాన్ విశాల్ మహార్యాలీలో ఆమె ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. రాఇనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీచేస్తామని మాయావతి అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో ఉత్తరప్రదేశ్ ‘కైమ్ర్ ప్రదేశ్’గా మారిపోయిందని విమర్శించారు. తనపై గత తొమ్మిది సంవత్సరాలుగా సాగుతున్న సీబీఐ విచారణను రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. యూపీ ప్రభుత్వం నేరాలు అదుపు చేయడంతో పూర్తిగా విఫలమైందని, దీంతో నేరాలు పెరుగుతున్నాయని మాయావతి ఆరోపించారు. అఖిలేశ్ ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆమె పేర్కొంది. బీఎస్పీ మద్దతు లేకుండా కాంగ్రెస్, బీజేపీ మనుగడ సాధించవని ఆమె తేల్చి చెప్పింది. ముజఫర్‌నగర్ బాధితులను ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోలేదని మాయావతి విమర్శించింది.
ఒంటరి పోరాటం చేస్తాం మాయావతి




