మంత్రి డీకే అరుణ
హైదరాబాద్, జనవరి 16 (జనంసాక్షి) :
ఫిబ్రవరి ఆఖరులోగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయి మార్చి 1లోపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మంత్రి డీకే అరుణ అన్నారు. గురువారం నగరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని ఆమె వివరించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఎటూ తేల్చుకోలేపోతున్నారని మంత్రి డీకే అరుణ విమర్శించారు. చంద్రబాబు లేదా మరెవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎవరైనా చర్చించవచ్చన్నారు. గడువులోగా రాష్ట్రపతి పెట్టిన సమయాన్ని వినియోగించుకోవాలన్నారు. అదనపు సమయం అవసరం లేదన్నారు.
ఫిబ్రవరి ఆఖరుకు తెలంగాణ




