బిన్నీ అడ్డగోలు ఆరోపణలు
న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) :
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి రెండు వారాలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ అడ్డగోలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పైన, పార్టీ నేత అరవింద్ కేజీవ్రాల్ పైన పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత బిన్నీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిన్నీ మాట్లాడారు. ఆ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అని ధ్వజమెత్తారు. ఎవరినో ఎమ్మెల్యేలుగానే, పార్లమెంటు సభ్యులుగానో చేసేందుకు ఎఎపి పుట్టుకు రాలేదన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ పార్టీ ఏర్పాటయిందని గుర్తు చేసారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హావిూలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజీవ్రాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హావిూల అమలును కేజీవ్రాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. హావిూల అమలులో ఆయన వెనుకడుగు వేస్తున్నారని, మేనిఫెస్టోలో అమలు కాని హావిూలు ఉన్నాయన్నారు. డెన్మార్క్ మహిళ అత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెసు ఆడిస్తున్నట్లు- ఎఎపి ఆడుతోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేదొకటి చేసేదొకటని ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరినో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయడానికి ఆప్ ఏర్పాటు కాలేదని…అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఏర్పాటైందని అన్నారు. విద్యుత్ తాగునీటికి సంబంధించిన హావిూలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని అన్నారు.దీనిపై ఆప్ నేత యోగేంద్ర యాదవ్ గురువారం స్పందించారు. బిన్నీ వ్యాఖ్యలు విచారకరమన్నారు. పార్టీ సమావేశాల్లోనే ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆరోపణలు చేశారో చెప్పాలన్నారు. అధికారంలోకి రాగానే ఎఎపి ప్రభుత్వం విద్యుత్ ధరలను తగ్గించిందన్నారు. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్, హర్షవర్ధన్ ఆరోపణలను బిన్నీ విప్పుతున్నారన్నారు. నేరుగా విూడియా ఎదుట మాట్లాడటం ఏమిటో చెప్పాలన్నారు. కాగా, బిన్నీకి ఏఏపీ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందు వినోద్ కుమార్ బిన్నీ ప్రభుత్వంపై, కేజీవ్రాల్ పైన విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. తనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు సిద్ధమేనని ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నబిన్నీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌పై విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. మంత్రిపదవి, లోక్‌సభ స్థానం కోసమే బిన్నీ ఆరోపణలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ నేత యోగేంద్ర యాదవ్ అన్నారు. ఈ ఆరోపణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్న ఆయన బిన్నీ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే విద్యుత్ ధరలు తగ్గించామన్నారు.
కేజ్రీవాల్ రెండు వారాల్లో హామీలు నెరవేర్చలేదు




