Wednesday, 4 November 2026

కేజ్రీవాల్‌ పిచ్చి సీఎం : షిండే

ఆప్‌ కాంగ్రెస్‌ మధ్య పెరిగిన మాటల యుద్ధం
ముంబై, జనవరి 22 (జనంసాక్షి) :
ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌పై కేంద్ర ¬ంమంత్రి షిండే మండిపడ్డారు. ‘పిచ్చి’ ముఖ్యమంత్రి అని అర్థం వచ్చేలా మరాఠీలో మాట్లాడారు. ఈ పిచ్చి ముఖ్యమంత్రి మూలంగా తాను వేలాది పోలీసులను సెలవులు రద్దు చేసి మరీ బందోబస్తుకు నియమించాల్సి వచ్చిందని షిండే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా షిండే చేసిన ఈ వ్యాఖ్యలు ఆప్‌ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. మరోవైపు ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్‌భారతికి ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఉగాండా మహిళ ఇంట్లో చొరబడి దాడిచేశారనే ఆరోపణలపై మహిళా కమిషన్‌ సోమనాథ్‌ వివరణ కోరింది. శుక్రవారంలోగా సోమనాథ్‌ భారతి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్‌ ఆదేశించింది. కేజ్రీవాల్‌పై షిండే వ్యాఖ్యల తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆప్‌ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏకు ఢిల్లీ ప్రజల రక్షణ బాధ్యత పట్టదా అంటూ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *