ప్రతి సభ్యుడికి ఐదు నిమిషాలే
పెంచమని నేను కోరలేదు.. సీఎమ్మే అడిగాడు : స్పీకర్
న్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 23 (జనంసాక్షి) :
అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు గడువుపై ఉత్కంఠతకు తెరపడింది. ఆంధప్రదేశ్ పునర్వ్యవ్థసీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువును రాష్ట్రపతి ఈనెల 30 వరకు పొడిగించారు. ముసాయిదా బిల్లుపై సభ్యులు అభిప్రాయాలు తెలిపేందుకు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. చర్చ సమయాన్ని మరో నాలుగు వారాలు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. ఈ లేఖ ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరింది. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చకు వారం రోజులు గడువు పొడిగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం మినహాయిస్తే 6 పనిదినాలు పొడిగించినట్లు అవుతుంది. చర్చకు గడువు పెంచమని సీఎం కిరణ్ కోరడంతో రాష్ట్రపతి వారం పాటు గడవు పెంచారు. దీంతో జనవరి 30వరకు టీ బిల్లుపై చర్చ కొనసాగనుంది. ఈ వార్తలకు సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు వాస్తవమేనని నిర్ధారించాయి. రిపబ్లిక్ డే మినాహాయిస్తే మరో ఆరు రోజుల పాటు టీ బిల్లుపై చర్చ జరగనుంది. టీ బిల్లుపై చర్చకు గడువు పొడిగింపు దష్ట్యా శుక్రవారం బీఏసీ సమావేశం కానున్నట్లు తేలుస్తోంది. టీ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి వారం పాటు గడువు పెంచడంతో బిల్లుపై చర్చ ఈ నెల 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్వ్యవ్థసీకరణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలను తెలపటానికి ఇచ్చిన గడువును రాష్ట్రపతి మరో వారం వరకు పొడిగించొచ్చని ముందే ఊహించారు. బిల్లుపై చర్చకు కాలపరిమితిని పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై రాష్ట్రపతి గురువారం నిర్ణయం తీసుకోవచ్చని కూడా భావించినట్లుగానే ఈ నిర్ణయం వెలువడింది. రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రాయాలను తెలపటానికి రాష్ట్రపతి విధించిన గడువు గురువారంతో ముగుస్తుంది. అయితే బిల్లుపై మాట్లాడేందుకు అన్ని ప్రాంతాల సభ్యులు పట్టుదల చూపుతున్నందున చర్చ సమయాన్ని మరో నాలుగు వారాలు పొడిగించాలంటూ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి వేర్వేరుగా కేంద్రానికి లేఖలు పంపించారు. ముఖ్యమంత్రి నేరుగా రాష్ట్రపతికే రెండు లేఖలు రాయగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ¬ంశాఖ కార్యదర్శికి లేఖరాశారు. ఈ లేఖ ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరింది. మరోవైపు గడువును పొడిగించొద్దంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా రాష్ట్రపతికి లేఖలు రాశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి నిర్ణయం తీసుకుటన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే అటార్నీ జనరల్ అభిప్రాయాన్నీ కోరారు.
ముసాయిదాపై చర్చకు రాష్ట్రపతి వారం రోజులు గడువు పెంచిన నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి శుక్రవారినికి వాయిదా పడ్డాయి. అనంతరం గురువారం మధ్యాహ్నం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిల్లుపై ఓటింగ్ విషయంలో స్పష్టత రాలేదు. 26వ తేదీ ఆదివారంతో పాటు గణతంత్ర దినోత్సవం కావడంతో దానిని మినహాయించి అన్నిరోజులు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. అంటే ఈ నెల 30 వరకు చర్చించాలని నిర్ణయించారు. విభజన బిల్లుపై చర్చకోసం రాష్ట్రపతి ఇచ్చిన గడువు కీలకం కానుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. మరింత గడువు కోరేందుకు ఈ సారి సభాపతికే అవకాశం ఉందని సభా నాయకుడికి లేదని తెలిపారు. ఓట్లకోసం, సీట్లకోసం ప్రాంతాలవారీగా కాంగ్రెస్, టీడీపీలు వాదనలు వినిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కాని తాము రాజకీయంగా నష్టాలన్ని లెక్కచేయకుండా ఒకే వాదాన్ని వినిపిస్తున్నాం అని వైఎస్ విజయమ్మ తెలిపారు. విూరు స్వార్థంతో వాదనలు వినిపిస్తున్నారని, తాము త్యాగంతో ఒకే వాదన వినిపిస్తున్నామని వైఎస్ విజయమ్మ అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆంధప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 పై ఓటింగ్ ఉండాల్సిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయమ్మ డిమాండ్ చేశారు. శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో విభజన బిల్లుపై ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధకరమని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి తెలిపారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాకపోవడం చాలా బాధకరమని ఆమె అన్నారు. బీఏసీకి టీడీపీ రెండు ప్రాంతాల ప్రతినిధులను పంపి రెండు వాదనలు చెప్పిందని శోభానాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి ఆ పార్టీ విధానంపైనే స్పష్టత లేదని ఆమె విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య తీర్మానంతో పాటు.. విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని కోరినట్టు శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో శుక్రవారం నుంచి ప్రతి సభ్యుడు ఐదు నిముషాల చొప్పున మాట్లాడేందుకు అవకాశం రానుంది. చర్చకు రాష్ట్రపతి గడువు పెంచడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ముసాయిదాపై చర్చకు గడువు పెంచాలని కోరుతూ తాను రాష్ట్రపతికి ఎలాంటి లేఖ రాయలేదన్నారు. సభలో ఇరు ప్రాంతాల సభ్యులు వర్గాలు విడిపోయినందున తాను లేఖ రాయలేదని, ముఖ్యమంత్రే లేఖ రాశారని స్పీకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారం రోజులు గడువు పెంచారని, కాబట్టి ఐదు నిముషాలు మాట్లాడే సభ్యులకు శుక్రవారం నుంచి సమయం కేటాయిస్తామని స్పీకర్ తెలిపారు. ఈ నెల 26 రిపబ్లిక్ డే గనుక ఆ రోజు మినహాయించి సభ రెండు పూటలా నడుపుతామన్నారు. బిల్లుపై చర్చ పూర్తి అయ్యే వరకు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టరాని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కోరాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభించగా పలుమార్లు టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేస్తూ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఏ అంశమైనా బీఏసీలో చర్చించాకే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సభాపతి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వాల్సిందిగా సభ్యులు స్పీకర్‌ను కోరారు. సభా సంప్రదాయాల ప్రకారమే ముందుకు వెళదామని నాదెండ్ల అన్నారు. ఇప్పటి వరకు బిల్లుపై 65 మంది సభ్యులు అభిప్రాయాలు చెప్పారని, వారు మాట్లాడిన సమయం 43.05 గంటలని సభాపతి తెలిపారు.చర్చకు మరింత సమయం కోరుతూ తీర్మానం చేద్దామని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన ప్రతిపాదనను టీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. వారం రోజులు పొడిగించారని, ఇంకా అవసరం లేదని వారన్నారు. ఒక సభ్యుడిగా తీర్మానం పెట్టే హక్కు తనకు ఉందని, నాలుగు వారాలు గడువు పెంచమని సీఎం రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని పయ్యావుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ మాట్లాడుతూ గడువు పెంచాలని కోరే హక్కు ప్రతి ఒక్క సభ్యునికి ఉంటుందని అన్నారు. సవరణలను అంగీకరిస్తున్నారో లేదో తెలియాలంటే ఓటింగ్ అవసరం ఉందని పయ్యావుల అన్నారు. బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం తిరిగి అసెంబ్లీ ప్రారంభమైంది. చర్చపై గడువు ఇంకా వారం రోజులు పొడిగించినందున సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు వారం రోజులు గడువు పెంచుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి గురువారం మధ్యహ్నం ఉత్తర్వులు రావడంతో ఆ లేఖను రాష్ట్ర శాసనసభా కార్యదర్శి రాజాసదారాం సభలో చదివి వినిపించారు. దీంతో సభను కాసేపు వాయిదా వేసినట్టు సభాపతి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి సభ్యులు అందరినీ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సభలో ఎలా అనుసరించాలి, చర్చలు ఎలా జరపాలి, సీఎం కిరణ్ మాట్లాడుతున్నప్పుడు సభలో సభ్యులు అభ్యంతరం చెప్పడం, గందరగోళం సృష్టించడం, విప్‌గా ఉన్నటువంటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ సభ్యుడు గాదె వెంకటరెడ్డి విూద దాడి చేయడం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగం మధ్యలో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సభ్యులందరికి బిల్లుపై తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పేందుకే రాష్ట్రపతి గడువు పెంచారని, సభా హక్కులను కాపాడాలని, ఏమైనా వ్యతిరేకత ఉంటే సభ్యులు మాట్లాడితన తర్వాత వారు తిప్పి కొట్టే అవకాశం ఉంటుందని వీటన్నిటిని సభ్యులు పాటించాలని సభాపతి నాదెండ్ల మనోహన్ సభ్యులకు సూచించారు. సభ్యులందరూ ఈ సూచనలను పాటించాల్సిన అవసరం ఉంటుందని స్పీకర్ సూచించారు.
గడువు వారం రోజులే




