టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్, జనవరి 23 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి క్రికెట్ తప్ప చరిత్ర తెలియదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన టీఎన్‌జీవోస్ హైదరాబాద్ శాఖ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చ జరిగే సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని సీఎం కిరణ్ అనడమే తెలంగాణవాదులు సాధించిన పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి క్రికెట్ తప్ప చరిత్ర ఎంతమాత్రం తెలియదని కోదండరామ్ ఎద్దేవా చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన అధిష్టానాన్నే దిక్కరించి తెలంగాణను వ్యతిరేకిస్తున్నాడని ఎలాంటి ప్రాతిపదిక లేని అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని ఇంతకాలం తక్కువ చేసి చూపిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తీరా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోయే వేళ సీమాంధ్ర ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ చరిత్ర గల తెలంగాణకు, సీమాంధ్రులు సాగిస్తున్న కృత్రిమ ఉద్యమానికి ఎంతమాత్రం పొంతనలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఇక తెలంగాణ ఆగబోదన్నారు. అసెంబ్లీ తెలంగాణ ప్రతినిధులు నిర్మాణాత్మకమైన చర్చలో పాలుపంచుకొని ఆంక్షలు లేని హైదరాబాద్ సహా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, దేవిప్రసాద్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిరణ్‌కు క్రికెట్ తప్ప చరిత్ర తెలియదు




