Wednesday, 4 November 2026

ఆమ్‌ ఆద్మీ మరో విజయం

ఢిల్లీలో ముగ్గురు పోలీసు అధికారుల సస్పెన్షన్‌
న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) :
ఆమ్‌ ఆద్మీ మరో విజయం సాధించింది. ఢిల్లీలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇచ్చిన వీడియో క్లిప్పింగ్‌ ఆధారంగా ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. ఈమేరకు ఢిల్లీ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొందరిని సెలవులపై పంపిన అధికారులు తాజాగా శుక్రవారం ఈ చర్య తీసుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఇచ్చిన వీడియోను అనుసరించి ముగ్గురు పోలీసులను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళనకు దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆన్‌లైన్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. జనవరి 12న ఢిల్లీలోని ఎర్రకోట సవిూపంలో ఈ వీడియో తీసినట్లు.. ఇందులో ముగ్గురు పోలీసులు ఓ వ్యక్తిని కొడుతూ, అతని వద్ద నుంచి డబ్బులు లాక్కున్నారని ఆప్‌ నేతలు తెలిపారు. దీంతో వీరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్‌ భారతి ఢిల్లీ మహిళా కమిషన్‌ ముందు హాజరు కాలేదు. మహిళా కమిషన్‌ వద్దకు ఆయన తన బదులుగా న్యాయవాదిని పంపారు. విదేశీ మహిళలతో అసభ్యకర ప్రవర్తన ఆరోపణలపై సోమనాథ్‌కు మహిళా కమిషన్‌ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన అసభ్యంగా వ్యవహరించినట్లు ఎలాంటి ఆధారాలు దక్కలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ధర్నాకు దిగిన సంఘటనపైకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. రాజ్యంగబద్ధమైన ¬దాలో ఉండి చట్టాన్ని అతిక్రమించిన కేజీవ్రాల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎంఎల్‌ శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. జస్టిస్‌ ఆర్‌ ఎమ్‌ లోథా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. చట్టాలను రూపొందించాల్సిన వారే చట్టాలను ఉల్లంఘించరాదంటూ శర్మ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రానికి ¬ం శాఖ కార్యదర్శి ద్వారా నోటీసులు పంపించింది. ఢిల్లీ పోలీసులను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తేవాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని నడిబొడ్డున అరవింద్‌ కేజీవ్రాల్‌ సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇద్దరు పోలీస్‌ అధికారుల్ని కేంద్రం బదిలీ చేయడంతో వివాదం సద్దుమణిగింది.ఇదిలావుంటే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం జనవరి 26లోగా ఆమ్‌ ఆదీ పార్టీ ఆన అభ్యర్ధుల మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలియవచ్చింది. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కోన్ని స్థానాల్లో పోటి చేయనున్న అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొదటి జాబితాలో సీనియర్‌ పార్టీ నేతలు, ప్రముఖుల పేర్లు రానున్నాయి. గతవారం అభ్యర్ధులను ఎన్నుకునే విధానంలో రెండు రౌండ్లు పూర్తయ్యాయి, జనవరి 26 లోపు పార్టీ మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు- సమాచారం. అర్హతగల సభ్యుల జాబితాను పార్టీ ముందు ప్రకటించవచ్చునని, ఆ తరువాత పార్టీలోని ముఖ్యలను సంప్రదించి జాబితాలోని కొందరిని ఎన్నుకోవచ్చని తెలియవచ్చింది. ఈ నెల మొదటి వారంలో ఆ పార్టీ జాతీయ సమావేశాలు జరిగినప్పుడు తమ అభ్యర్ధుల మొదటి జాబితాను జనవరి 15-20 తేదీల మధ్యలో ప్రకటిస్తామని ఆప్‌ పార్టీ నేతలు అన్నారు. కాని ప్రజల నుంచి భారీ స్పందనగా లెక్కలేనన్ని ధరఖాస్తులు రావడంతో జాబితా ప్రకటనలో ఆలస్యం జరిగింది. లోక్‌ సభ ఎన్నికలకు పోటీ చేయలనుకునే అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపవలిసిన చివరి తెది జనవరి 15 అయినా ఇప్పటికీ తాము ధరఖాస్తులను స్వీకరిస్తున్నామని, ఢిల్లీ, హర్యానాలకు ఎక్కువమొత్తంలో ధరఖాస్తులు వచ్చాయని, ఆప్‌ పార్టీ నేత దిలీప్‌ పాండే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *