బాబు కుట్ర
సీమాంధ్ర బాబులు ఒక్కటయ్యిండ్రు
అసలు బిల్లు పంపండి
ముసాయిదా వెనక్కు పంపాలని స్పీకర్‌కు నోటీస్
హైదరాబాద్, జనవరి 25 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొదటి నుంచి అడ్డు తగులుతోన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం సభలో మళ్లీ కిరికిరికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా తప్పుల తడకగా ఉందని, దాన్ని రూల్ 77 కింద రాష్ట్రపతికి తిప్పిపంపాలని స్పీకర్‌కు నోటీసిచ్చాడు. ఆయన చర్యలకు ప్రధాన ప్రతిపక్ష నేత తందానా అన్నాడు. రాష్ట్ర విభజన బిల్లు పూర్తిగా తప్పుల తడకగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, దీనిని అందరూ వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంతటి ఉల్లంఘనలతో ఉన్న బిల్లును ఏ విధంగా చర్చిస్తామని ప్రశ్నించారు. విభజనవల్ల ఏం ప్రయోజనం చేకూరుతుందో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పకుండా శాసనసభ అభిప్రాయం కోరడమేమిటని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిలదీసారు. విభజన బిల్లుపై చర్చలో భాగంగా సీఎం మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘనలతో బిల్లును పంపారని అన్నారు. ఇంతకీ ఇది ముసాయిదానా లేక ఒరిజినల్ బిల్లా అన్నది తెలియదన్నారు. అయితే ఇది డ్రాఫ్ట్ బిల్లని లేఖరాశాకనే చెప్పారని అన్నారు. అలాంటప్పుడు దీనిపై ఎలా చర్చిస్తామని అన్నారు. డ్రాఫ్ట్ బిల్లు పంపితే ఎలా దీనిని అంగీకరిస్తామని ప్రశ్నించారు. ఆయన తన ప్రసంగంలో పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తూ కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరుగుతున్న శాసనసభకు అసంపూర్ణ సమాచారం ఇచ్చి చర్చించమంటారా?అని అడిగారు. బిల్లు పంపిన కేంద్రం ఎందుకు విభజన చేస్తుంది.. దాని ప్రయోజనాలేమిటి. అన్న ఆబ్జెక్టును చెప్పలేదన్నారు. శాసనసభకు వచ్చిందా బిల్లా?, డ్రాప్ట్ బిల్లా? అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదని సీఎం కిరణ్ తెలిపారు. బిల్లు ఏకపక్షంగా ఉందని ప్రధానికి, ప్రసిడెంట్‌కు లేఖ రాశామని సీఎం పేర్కొన్నారు. ప్రజల్లో ఏకాభిప్రాయం తేవాలని కేంద్రానికి చెప్పానన్నారు. విభజన ఉద్దేశ్యం, లక్ష్యలు పేర్కొనలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రపతికి బిల్లు పంపారని ఆరోపించారు. కేంద్ర అభిప్రాయం చెప్పకుండా.. రాష్ట్ర అభిప్రాయం ఏలా చెబుతారని ప్రశ్నించారు. బిల్లులో ఎన్నో పొరపాట్లు తప్పులు ఉన్నాయని అన్నారు. కామన్ క్యాపిటల్ రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఇకపోతే విభజనకు సంబంధించి జరిగిన ప్రతి సందర్భంలోనూ తాను వ్యతిరేకించానన్నారు. తానేం ఉత్తగా ఉండలేదన్నారు. విబజన సరికాదనే చెప్పానన్నారు. రాష్ట్రానికి ఉన్న అధికారాలు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తీసుకోవడానికి లేదన్నారు. శాసనసభకు పంపించింది తుది బిల్లా లేక ముసాయిదా బిల్లా? ¬ంశాఖ ఇస్తున్న వివరణలు గందరగోళంగా ఉన్నాయన్నారు. ఇకపోతే సభ్యులు కోరిన వివరాలేవి ¬ంశాఖ నుంచి రాలేదన్నారు. విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యలను చూస్తాం.. చేస్తాం అంటే కుదరదు. విభజన వల్ల వచ్చే సమస్యలను ఫలానా విధంగా పరిష్కరిస్తామని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి అయినా, ఎవరైనా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే అంటూ, అటార్నీ జనరల్ ఇచ్చిన అభిప్రాయాన్ని కోరగా అది ఇవ్వలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం ఉండకపోవడానికి నాటి నేతలే కారణం తప్ప సీమాంధ్ర ప్రజలో లేక నాయకులో కాదన్నారు. తెలంగాణ ఇస్తే తనకు వ్యక్తిగతంగా ఏం నష్టంలేదని, ఇక్కడి ప్రజలకే నష్టమని వివరించారు. హైదరాబాద్ విూదికాదు… ఇక్కడ్నుంచి వెళ్లిపొమ్మంటే ఎంత బాధో ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌లో అన్ని ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండి, 42మంది ఎంపీలుంటేనే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయన్నారు. తెలంగాణలోనే పుట్టాను, పెరిగాను… నా మిత్రులంతా ఇక్కడి వారేనని సీఎం వివరించారు. వ్యక్తులు మారినప్పుడు విధానాలు మారినా… ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదన్నారు. తెలంగాణకు వచ్చే నష్టంపైనే మాట్లాడుతున్నాను తప్ప మరొకటి కాదన్నారు. ప్రజల్లో ఏకాభిప్రాయం వచ్చాకే విభజనకు వెళ్లాలని తాను కోరానని అన్నారు. ఏకాభిప్రాయం నాయకుల్లో కాదు.. ప్రజల్లో తేవాలన్నారు. హైదరాబాద్ మతపరంగా చాలా సున్నితమైన నగరం. రాష్ట్రం సమైక్యంగా ఉంది కాబట్టే ప్రస్తుతం పోలీసు వ్యవస్థ బలంగా ఉంది. తెలంగాణలో పుట్టినవాడిగా ప్రత్యేక రాష్ట్రం వస్తే నష్టం జరుగుతుందనే నా బాధని అన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారన్న విషయం మరచిపోరాదన్నారు.. ఇరు ప్రాంతాలు ఒక్కటిగా ఉంటేనే నక్సల్స్ సమస్యను సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. తెలంగాణ ఏర్పడితే శాంతిభద్రతల సమస్య వస్తుందని కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారని అన్నారు. ఏటా 28వేల కోట్లు సంక్షేమానికి ఖర్చుపెడుతున్నాం. అడ్వకేట్ జనరల్‌గా తెలంగాణ వారున్నా.. ఆంధ్రావారు అడగలేదన్నారు. శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని, ఏ ప్రాతిపదిక లేకుండా ఏక పక్షంగా విభజన బిల్లును రూపొందించారని మండిపడ్డారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల నుంచి అత్యధిక కేటాయింపులు తెలంగాణకేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బిల్లుపై చర్చలో భాగంగా సభలో సీఎం మాట్లాడుతూ.. బొగ్గు కేటాయింపులు చేసేది కేంద్రమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదన్నారు. డిమాండ్‌కు సరిపడా గ్యాస్ ఉత్పత్తి రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో 7వేల మెగావాట్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోందని సీఎం వివరించారు. 35 వేల కోట్లు పెట్టుబడి పెట్టినా గ్యాస్ లభ్యం కావట్లేదని పేర్కొన్నారు. గ్యాస్ లభ్యత లేకపోతే ప్రతినెలా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని, పొరుగు రాష్ట్రాల నుంచి గ్యాస్ కొందామన్నా లభ్యత లేదన్నారు. గ్యాస్ కేటాయించమని తెలంగాణకు చెందిన కేంద్రమంత్రికి ఘాటుగా లేఖ రాసినట్లు సీఎం వెల్లడించారు. ఇక తెలంగాణ బిల్లులో లా అండ్ ఆర్డర్ అంశాన్ని ఆషామాషీగా చేర్చారని విమర్శించారు. నగరంలో వినాయక నిమజ్జనం సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అందు కోసం ఆంధ్రాప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో బలగాలను ఇక్కడకు తరలిస్తారని తెలిపారు. మరి రాష్ట్రం విడిపోతే అంత మంది పోలీసులను ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం కలిసుండటం వల్లే ఆంధప్రదేశ్‌కు ఎక్కువగా నిధులు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. విడిపోతే రెండు ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. విడిపోతే ఉద్యోగుల సంఖ్య పెరిగి రెండు రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని వివరించారు.
రాజ్యంగాన్ని ఉల్లంఘిస్తే తిప్పి పంపవచ్చు : చంద్రబాబు
విభజన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే తిప్పి పంపే హక్కు అసెంబ్లీకి ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని సిఎం అంటే, ఆయనకు తెలియకుండానే బిల్లు వచ్చిందా? ఆయనకు తెలియకుండానే కేంద్రానికి సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ అన్నది రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థ అని మనమంతా వ్యవస్థకు అనుకూలంగా నడుచుకోవాలని అన్నారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తరవాత ఆయన మాట్లాడుతూ అందరూ రాజ్యంగానికి లోబడే పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత అన్నారు. బిల్లుపై చర్చలో భాగంగా సీఎం చేసిన ప్రసంగంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తనకు తెలియకుండానే బిల్లు వచ్చిందని, తప్పుల తడకగా ఉందని సీఎం అన్నారు. విభజన బిల్లు రూపకల్పనలో పేర్కొన్న సమాచారం సీఎం నుంచి వెళ్లలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప మరొకటి కాదని తాము ముందునుంచి చెబుతున్నామని అన్నారు. అందరూ రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేయాలి తప్ప, రాజ్యాంగాన్ని అధిగమించి విచ్చలవిడిగా చేయడానికి ఎవరికీ అధికారం లేదన్నారు. అన్ని వ్యవస్థలకు అధికారాలే కాదు.. పరిధిలు కూడా ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై తన అభిప్రాయాన్ని సోమవారం వెల్లడిస్తానని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని బాబు ఆరోపించారు. బిల్లు లోపభూయిష్టంగా ఉంటే తిప్పి పంపే హక్కు అసెంబ్లీకి ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. బిల్లులో లోపాలుంటే సీఎం మొదట్లోనే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమైతే బిల్లును మేం అంగీకరించమని తెలిపారు. సీఎంకు తెలియకుండానే రాష్ట్ర సమాచారాన్ని కేంద్ర తీసుకుందా అని అడిగారు. దీనికి స్పందించిన సీఎం మాట్లాడుతూ…కేంద్రం అడిగితే సీఎస్ సమాచారం ఇచ్చారని తెలిపారు. సమాచారం ఇవ్వడమంటే విభజనకు అనుకూలం కాదని సీఎం తెలిపారు. అందుకు స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యమని వాటిని గౌరవించాలని తెలిపారు.
ముసాయిదా బిల్లు తప్పుల తడకగా ఉంది కాబట్టి తిప్పి పంపాలంటూ సీఎం కిరణ్ ఎదురు తిరిగారు. చంద్రబాబు ఇచ్చిన సూచనను ఊతంగా చేసుకుని బిల్లును వెనక్కి పంపేందుకు పక్కా ప్రణాళిక వేశారు. ఇన్నాళ్లూ తుఫాన్‌ను ఆపలేకపోయినా బిల్లును ఆపుతానన్న ఆయన తన మెదడుకు మేత పెట్టారు. అసెంబ్లీలో బిల్లు తప్పుల తడకగా ఉందని వాదించిన సిఎంఇప్పుడు ఆ బిల్లును వెనక్కి పంపాలంటూ సభాపతి నాదెండ్ల మనోహర్‌కు నోటీసిచ్చారు. రూల్ 77 కింద బిల్లు తిప్పి పంపాలన్నారు. ఇది ముసాయిదా బిల్లు మాత్రమేనని, దీనిపై చర్చించడం సాధ్యం కాదన్నారు. తప్పుల తడకగా ఉన్నందున వెనక్కి పంపాలని సభానాయకుడి ¬దాలో సీఎం ఈ నోటీసిచ్చినట్లు సమాచారం. అలాగే శాసనమండలిలో బిల్లు వెనక్కి పంపాలని ఛైర్మన్‌కు మంత్రి రామచంద్రయ్య నోటీసిచ్చారు. అంతకుముందు సభలో సిఎం బిల్లుపై ఘాటుగా స్పందించారు. ఈ బిల్లు నిబంధనలకు లోబడి లేదని అన్నారు. ఇది ముసాయిదా బిల్లని, కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని గట్టిగా విమర్శించారు. ముసాయిదా బిల్లుపై ఎలా చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు పూర్తిగా తప్పుల తడకగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, దీనిని అందరూ వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంతటి ఉల్లంఘనలతో ఉన్న బిల్లును ఏ విధంగా చర్చిస్తామని ప్రశ్నించారు. అసలు బిల్లులో ఆబ్జెక్టు లేదన్నారు. విభజనవల్ల ఏం ప్రయోజనం చేకూరుతుందో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పకుండా శాసనసభ అభిప్రాయం కోరడమేమిటని కిరణ్‌కుమార్‌రెడ్డి నిలదీసారు. విభజన బిల్లుపై చర్చలో భాగంగా సీఎం మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘనలతో బిల్లును పంపారని అన్నారు. ఇంతకీ ఇది ముసాయిదానా లేక ఒరిజినల్ బిల్లా అన్నది తెలియదన్నారు. అయితే ఇది డ్రాఫ్ట్ బిల్లని తాను లేఖరాశాక ¬ంశాఖ వర్గాలు తెలిపాయని అన్నారు. అలాంటప్పుడు దీనిపై ఎలా చర్చిస్తామని అన్నారు. డ్రాఫ్ట్ బిల్లు పంపితే ఎలా దీనిని అంగీకరిస్తామని ప్రశ్నించారు. ఆయన తన ప్రసంగంలో పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తూ కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరుగుతున్న శాసనసభకు అసంపూర్ణ సమాచారం ఇచ్చి చర్చించమంటారా?అని అడిగారు. బిల్లు పంపిన కేంద్రం ఎందుకు విభజన చేస్తుంది.. దాని ప్రయోజనాలేమిటి. అన్న ఆబ్జెక్టును చెప్పలేదన్నారు. చర్చ జరిగి అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడ్డాక అనూహ్యంగా సిఎం స్పీకర్‌కు లేఖ రాయడం చూస్తుంటే కలకలం చెలరేగేలా ఉంది. బిల్లు ఏకపక్షంగా ఉందని ప్రధానికి, ప్రసిడెంట్‌కు లేఖ రాశామని సీఎం పేర్కొన్నారు. బిల్లులో ఎన్నో పొరపాట్లు తప్పులు ఉన్నాయని అన్నారు. శాసనసభకు పంపించింది తుది బిల్లా లేక ముసాయిదా బిల్లా? ¬ంశాఖ ఇస్తున్న వివరణలు గందరగోళంగా ఉన్నాయన్నారు. సీఎంతో జరిగిన చర్చలో చంద్రబాబు గట్టిగా చేసిన సూచనను ఇప్పుడు తిప్పి పంపేందుకు సిఎం ఉపయోగించుకున్నారు. తిప్పిపంపే అధికారం ఉందని, కేవలం రాజకీయం కోసమే విభజన బిల్లు వచ్చిందన్న చంద్రబాబు సూచనలు మెర్క్యూరీలా పనిచేశాయి. విభజన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే తిప్పి పంపే హక్కు అసెంబ్లీకి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని సిఎం అంటే, ఆయనకు తెలియకుండానే బిల్లు వచ్చిందా? ఆయనకు తెలియకుండానే కేంద్రానికి సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ అన్నది రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన వ్యవస్థ అని మనమంతా వ్యవస్థకు అనుకూలంగా నడుచుకోవాలని అన్నారు. అసెంబ్లీలో సిఎం మాట్లాడిన తరవాత ఆయన మాట్లాడుతూ అందరూ రాజ్యంగానికి లోబడే పనిచేయాలని అన్నారు. బిల్లుపై చర్చలో భాగంగా సీఎం చేసిన ప్రసంగంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే ఎందుకు తిప్పి పంపలేదన్నారు. తిప్పిపంపే అధికారం అసెంబ్లీకి ఉందన్నారు. గతంలో బీహార్ విషయంలో ఇలాగే జరిగిందన్నారు. ఇది గమనించిని సీఎం కిరణ్ అసెంబ్లీ వాయిదా పడగానే లేఖను స్పీకర్‌కు పంపారు. అయితే ఇప్పుడు స్పీకర్ ఏ రకమైన చర్య తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. శాసనసభ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిందని చెప్పారు. ఏ సభ్యుడైనా స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించాలని తెలిపారు. మరోవైపు ¬ంశాఖ లేఖపై తమకు తెలియదని లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలంగాణ, రాయలసీమ వారిని కూర్చోబెట్టి మాట్లాడారని తనకు ఎలాంటి సమాచారం లేదని ¬ంశాఖ కార్యదర్శి నుంచి రెండు లేఖలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన దానిలో బిల్లు అని ఉందన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత ఒక్కపదం కూడా మారలేదని.. ఎందుకింత అసాధారణ రీతిలో బిల్లు పంపించారో తేలాల్సి ఉందన్నారు. కేంద్ర వైఫల్యం కారణంగానే ప్రజల మధ్య ఎడబాటు నెలకొందని చెప్పారు.





