Wednesday, 4 November 2026

ప్రముఖులకు పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) :
కేంద్రం 2014 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఇద్దరు పద్మ విభూషణ్‌, 24మంది పద్మభూషణ్‌, 101 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి పద్మభూషణ్‌ ఏడుగురికి పద్మశ్రీ పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. పద్మవిభూషణ్‌: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.మషేల్కర్‌, యోగా గురు బీకేఎస్‌ అయ్యంగార్‌, పద్మ భూషణ్‌ : పుల్లెల గోపీచంద్‌, స్వర్గీయ డాక్టర్‌ అనుమోలు రామకృష్ణ (శాస్త్ర సాంకేతిక రంగం), ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌, పద్మశ్రీ: డాక్టర్‌ మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్‌ (శాస్త్ర సాంకేతిక రంగం), డాక్టర్‌ గోవిందన్‌ సుందరరాజన్‌ (శాస్త్ర సాంకేతిక రంగం), మహ్మద్‌ అలీబేగ్‌ (నాటక రంగం), డాక్టర్‌ అనుమోలు రామారావు (సామాజిక సేవారంగం), నర్రా రవికుమార్‌ (పారిశ్రామిక, వాణిజ్య రంగం), ప్రొ.కొలకలూరి ఇనాక్‌ (విద్య, సాహిత్య రంగం), సర్వేశ్వర్‌ సహార్య(వైద్యరంగం, శస్త్ర చికిత్సలు), సైకత శిల్పి  సుదర్శన్‌ పట్నాయక్‌, సినీ నటుడు పరేష్‌ రావల్‌, డాక్టర్‌ ఎస్‌.సారయ్య (వైద్యరంగం), విద్యాబాలన్‌. అలాగే టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు అతను అందించిన సేవలకు గానూ కేంద్రప్రభుత్వం యువీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ గుర్తింపు పొందిన యువీ 2000లో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. 2011లో భారత జట్టు ప్రపంచకప్‌ గెలవడంలో యువీదే కీలకపాత్ర పోషించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *