తెలంగాణాకే వర్తిస్తాయా?
అపోహలను ప్రచారం చేయొద్దు : ఈటెల
హైదరాబాద్, జనవరి 25 (జనంసాక్షి) :
దేశంలో ఉన్న అన్ని సమస్యలు తెలంగాణాకే వర్తిస్తాయా అంటూ ముఖ్యమంత్రి కిరణ్కుపై టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అనేది భారత సార్వభౌమత్వానికి లోబడే ఏర్పడుతుంది తప్ప మరోటి కాదని అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఎగిరేది త్రివర్ణ పతకమే అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే కర్నూలు వాళ్లు పాస్పోర్టు తీసుకోనవసరం లేదని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా దేశం ఒక్కటే అని ముఖ్యమంత్రికి తెలియదా, సీఎం ఆ మాట చెబితే బాగుండేదని ఈటెల హితవు పలికారు. 371డీపై ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారని తెలిపారు. నియామకాలన్నీ స్థానికత పోను మిగతావి మీ ప్రాంతానికి రిజర్వ్ చేస్తారన్న విషయం మరచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకంటే ముందు 14 కొత్త రాష్టాల్రు ఎర్పడ్డాయని గుర్తు చేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినతర్వత 14 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కొత్త రాష్ట్రాలైన గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే సమస్యలు వస్తాయని సీఎం అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. మత కలహాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని ఆర్థికవేత్తలే చెబుతున్నారని అన్నారు. నక్సల్స్ సమస్య, కరెంటు సమస్య, ఆర్థిక సమస్య ,నీటి సమస్యలు దేశ వ్యాప్తంగా ఉందని ఒక్క తెలంగాణలో లేదని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పి కేంద్రంపై మాట్లాడి ఫెడరల్ సమైక్యకు విఘాతం కల్పించారని ఆరోపించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సీఎం మాటతప్పారని ఈటెల ధ్వజమెత్తారు. నిజంగానే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఎందుకు రాజీనామా చేసి మాట్లాడలేదన్నారు. ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు.
దేశంలో ఉన్న అన్ని సమస్యలు





