Wednesday, 4 November 2026

ఘనంగా గణతంత్ర వేడుకలు

అంబరాన్నంటిన సంబురాలు
అతిథిగా జపాన్‌ ప్రధాని షింజో
ఆకట్టుకున్న శకటాలు, విన్యాసాలు
న్యూఢిల్లీ, జనవరి 26 (జనంసాక్షి) :
భారత 65వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ్‌పథ్‌లో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే ఈ ఏడు గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద దేశం కోసం అసువులు బాసిన అమరజవాన్లకు నివాళులర్పించారు. ప్రభుత్వ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. నక్సల్స్‌ దాడిలో మరణించిన గ్రేహౌండ్స్‌ అధికారి ప్రసాద్‌బాబు కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి వేడుకల నేపథ్యంలో అశోక్‌చక్ర అవార్డును అందజేశారు. ఇదిలా ఉండగా ఇండియాగేట్‌ వద్ద ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అమరజవాన్లకు నివాళులర్పించారు. పటిష్ట భద్రత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ రాజధానిలో, దేశవ్యాప్తంగా పటిష్టంగా తను కల్పించారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక భద్రతా దళాలు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్లు, పారాషూటర్లు, పారామిలిటరీ బలగాలు, పోలీసు కమాండోలు రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఆర్గంలో వివిధ ప్రాంతాల్లో మోహరించి పట్టి భద్రత ఏర్పర్చారు. ఢిల్లీలో పోలీసు, పారామిలటరీ బలగాలకు చెందిన 25 వేల మందిపెరేడ్‌ సందర్భంగా నేలమీద, ఆకాశంలోనూ ఈగ చొరబడని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు బహిరంగ స్థలాల్లో కరడు గట్టిన ఉగ్రవాదుల ఫోటోలను అతికించి అప్రమత్తత ప్రకటించారు. రాజ్‌పథ్‌ చుట్టూ 125 పైగా భవంతులను పోలీసులు మూసివేశారు. పెరేడ్‌ జరిగిన ప్రాంతంలో 165 సీసీ టీవీలను అమర్చారు. పుతిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాన మన్మోహన్‌ సింగ్‌లకుపుతిన్‌ అభినందనలు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి పట్ల పుతిన్‌ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించార. 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఆధునిక భారత్‌ వికాసానికి నాంది పలికిందని గుర్తు చేశారు. అప్పటినుంచి దేశం సామాజిక, ఆర్థిక, శాస్త్రాయ, సాంకేతిక రంగాల్లో అత్యున్నత సాధికారత సాధించిందని పుతిన్‌ కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా గణతంత్ర ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసపత్రాలు, పురస్కారాలు ప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *