Tuesday, 3 November 2026

వీరులను స్మరిద్దాం

వారి ఆశయ సాధనకు కృషిచేద్దాం : నరసింహన్‌
హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) :
వీరుల త్యాగాలను స్మరిద్దామని, వారి ఆశయ సాధనకు, దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసేందుకు కృషి చేద్దామని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో భారత 65వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. కవాతు స్వీకరించారు. వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కొందరు మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 20కి పైగా బృందాలు కవాతు చేశాయి. వివిధ శాఖల పనితీరును ప్రతిబింబిస్తూ శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. అందర్నీ ఆకట్టుకున్నాయి. అమరవీరులు, త్యాగధనులను అందరూ స్మరించుకోవాలి. ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగించారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం. పారదర్శకంగా పనిచేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాసనమండలిలో మండలి చైర్మన్‌ చక్రపాణి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. గాంధీభవన్‌లో సీఎం కిరణ్‌కు సమైక్య సెగ తగిలింది. ఆదివారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జరిగిన రిపబ్లిక్‌ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సీఎం గో బ్యాక్‌.. జై తెలంగాణ అంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు పలువురునినాదాలు చేశారు. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే వారికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *