
హైదరాబాద్ : రాజ్యసభకు తెదేపా అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ప్రకటించారు. తెలంగాణ చెందిన మోతుకుపల్లి నర్సింహులు టిక్కెట్టు ఆశించి భంగ పడ్డాడు. గరికపాటి రామ్మోహన్, తోట సీతారామలక్ష్మీ పేర్లను ఖరారు చేశారు. వీరు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ నిర్వహించిన కీలక కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు గరికపాటికి అవకాశం కల్పించామని చంద్రబాబు తెలిపారు. పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి సీతారామ లక్ష్మీ అందించిన సేవలను పార్టీ గౌరవిస్తుందన్నారు. మహిళలను రాజ్యసభకు పంపాలనే ఉద్దేశంతోనే ఆమెకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి చేసిన సేవలను మరువదన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఆయనకు కచ్చితంగా న్యాయం చేస్తానని బాబు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా పార్టీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. రాజ్యసభకు మూడో అభ్యర్థిని నిలిపే ఉద్దేశం లేదన్నారు.
మోత్కుపల్లికి మొండిచేయి




