నామినేషన్ దాఖలు చేసిన కేకే
హైదరాబాద్, జనవరి 28 (జనంసాక్షి) :
పెద్దల సభలో బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు నిలిచారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు కాంగ్రెస్, ఇద్దరు టీఆర్‌ఎస్, ఒక టీఆర్‌ఎస్ అభ్యర్థి సహా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యు కోసం టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. టీఆర్‌ఎస్, సీపీఐ ఎమ్మెల్యేలు వెంటరాగా కేకే శాసనసభా కార్యదర్శి రాజాసదారంనకు తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన కేకేను మంత్రులు దానం నాగేందర్, వట్టి వసంతకుమార్ అభినందించారు. నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత టిఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉండి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఖాతరు చేయకుండా కేకే రాజీనామా చేసి కేసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వస్తుందని పార్టీలో చేరారన్నారు. తాము బిజెపితోగాని, ఎంఐఎంతోగాని మాట్లాడదలుచుకోలేదన్నారు. తెలంగాణా కోసం పోరాడడమే కాక కాంగ్రెస్‌లో పదవిని కూడా త్యజించుకున్న వ్యక్తిగా నిలిచాడన్నారు. తెలంగాణ రాష్ట్రసమితి పక్షాన కేకే రంగంలో కిదిగుతున్నాడన్నారు. ఆయనకు సిపిఐ మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు. కేకేకు రాజకీయంగా అపార అనుభవం ఉందన్నారు. ఆయన సేవలను రాబోయే తెలంగాణాలో వినియోగించుకునేందుకే టిఆర్‌ఎస్ రంగంలోకి దిగిందన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసమే లక్ష్యంగా పోరాడుతున్న కేకేను తమ పార్టీ నిలిపిందన్నారు. దీనిని నమ్ముకునే వారంతా సహకరించాలని కోరారు. సిపిఐ మద్దతివ్వడం ఆనందంగా ఉందన్నారు. బలహీన వర్గాల నేతగా ఉన్న కేకేకు సిపిఐ మద్దతివ్వడం శుభపరిణామమన్నారు. సిపిఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ మాట్లాడుతూ ఆయన ఎంతో అనుభవం ఉన్న నేతని అన్నారు. ఆయనను పోటీకి దింపడం శుభపరిణామమని అన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో కేశవరావుకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ శాసనసభాపక్షనేత మల్లేశ్ తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణవాదులు కేకేను గెలిపించుకుంటారనే విశ్వాసం ఉందన్నారు. కేశవరావుకు మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థిగా సీమాంధ్ర సమైక్యవాది చైతన్యరాజు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. చైతన్యరాజు మాట్లాడుతూ తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. రాజ్యసభ స్వతంత్ర అభ్యర్థిగా చైతన్యరాజు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయవద్దని జేసీ, చైతన్యరాజును మంత్రి దానం నాగేందర్ వారించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి వివిధ స్థాయిల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కాంగ్రెస్ అధిష్ఠానం సుబ్బిరామిరెడ్డి, కేవీపీ, ఎం.ఎ.ఖాన్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో రాజ్యసభ అభ్యర్థులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ బి-ఫారాలను అందజేశారు. అనంతరం ముగ్గురిని పీసీసీ అధ్యక్షుడు సహా పలువురు నాయకులు అభినందించారు. ఎస్సీ, ఎస్టీ బీసీల్లో ఒకరికి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు బాలరాజు, కొండ్రు మురళి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లు ఏఐసీసీ కార్యదర్శి కుంతియాను కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ అభ్యర్థిత్వాల్లో తమ వర్గాలను నిర్లక్ష్యం చేయడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజ్యసభలో బరిలో 9 మంది





