Tuesday, 3 November 2026

ఇదే బిల్లును ఆమోదిస్తే రాజకీయ సన్యాసం


అసెంబ్లీ అభిప్రాయం ప్రాధాన్యం కాకపోతే బిల్లెందుకు పంపారు : సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రానికి పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో యథాతథంగా ఆమోదిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఇదే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రానికి సవాల్‌ చేశారు. ఇదే బిల్లును పెట్టడానికి పార్లమెంటు అనుమతిస్తే రాజకీయాలనుంచి వైదొలగుతానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. గడువు ముగుస్తున్న దశలో మరోమారు గడువు పెంచే అవకాశం లేకపోవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి సవాల్‌ చేస్తూ బుధవారం సంచలన వాఖ్యలు చేశారు. అసెంబ్లీకి పంపిన బిల్లునే పార్లమెంట్‌లో ప్రవేశ పెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. శాసనసభ సమావేశాలు గురువారం నాటికి వాయిదా పడిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లులో అనేక లోపాలు, తప్పులు ఉన్నాయని, ఇది అసలు బిల్లు కాదని, కేవలం డ్రాఫ్ట్‌ బిల్లు మాత్రమేనని సీఎం కిరణ్‌ మరోమారు వ్యాఖ్యానించారు. ఇదే అసలైన బిల్లు అనేకంటే అసెంబ్లీ నుంచి తాము పంపిన బిల్లునే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెడతారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కేంద్ర¬ంశాఖ కేంద్రాన్ని, రాష్ట్రపతిని తప్పుదోవ పట్టించిందని, తాను అన్నింటికి సిద్ధంగా ఉన్నానని, దేనికీ భయపడేది లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా తాను కట్టబడి ఉన్నానని అన్నారు. మూడు వారాల అదనపు గడువు అడిగింది బిల్లులోని లోపాలను ఎత్తిచూపడానికేనన్నారు. అసెంబ్లీలో నేను మాట్లాడిన ప్రతి అంశానికీ ఒక ప్రాతిపదిక ఉందన్నారు. ఈ సభకు అధికారం లేదంటున్న వాళ్లు ఓటింగ్‌కు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సభ అభిప్రాయం లేకుండా నేరుగా పార్లమెంటే రాష్ట్ర విభజన చేయొచ్చుకదా అన్నారు. విభజనపై వారి ఉద్దేశం, ప్రాతిపదిక చెప్పకుండా ఈ సభ దేనిపై అభిప్రాయం చెప్పాలన్నారు. రాష్ట్ర విభజనకు తాను పూర్తిగా వ్యతిరేకమని, తనకు ఆంధప్రదేశ్‌ ప్రజలంతా కావాలని అన్నారు. బిల్లులో 9,024 సవరణలు వస్తే చర్చ, ఓటింగ్‌ లేకుండా అభిప్రాయం ఎలా చెప్తాం?అని అన్నారు. సభలో 86 మందే మాట్లాడారు.. అది రాష్ట్ర అభిప్రాయం ఎలా అవుతుంది? గతంలో విభజన జరిగిన రాష్ట్రాల్లో పరిస్థితులు వేరు. ఇక్కడి పరిస్థితులు వేరని, విభజన బిల్లుపై గడువు పొడిగిస్తారో లేదో చూస్తామన్నారు. రాష్టప్రతి నుంచి వచ్చే బిల్లులో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ¬ంశాఖపై ఉందన్నారు. బిల్లులోని లోపాలను సరిచేయమని కోరడం లేదు బిల్లును తిరస్కరిస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేయమని కోరుతున్నామని వివరించారు. ఏకాభిప్రాయంతోనే గతంలో రాష్టాల్రు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. విభజనకు కారణాలు, లక్ష్యాలు ఉన్న విభజన బిల్లు కావాలన్నారు. ఇదే బిల్లు పార్లమెంటులో పెట్టాలని సవాల్‌ చేశారు. ఇదే బిల్లు పార్లమెంటుకు పంపితే అస్సలు అడ్మిట్‌ కాదని చెప్పారు. ఒకవేళ అది జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సభకు అధికారం లేనప్పుడు ఓటింగ్‌పై నాయకులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై మళ్లీ పొడిగింపు అడగడంలో తప్పులేదన్నారు. బిల్లపై క్లాజులవారీగా చర్చ జరిపి తిరస్కరిస్తామన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో నిలిచిన రెబల్‌ అభ్యర్థులను ఉపసంహరించుకోమని చెప్పామని సీఎం ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *