హైదరాబాద్: ఇవాళ అసేంబ్లీలో తెలంగాణ బిల్లుపై ముగియడం హర్షణీయమని తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరాం స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో మరో ముందడుగు వేశామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులను కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పమన్నారు గానీ తీర్మానాలు, ఓటింగ్ చేయమని కేంద్రం చెప్ప లేదని తెలిపారు. ఏదేమైనా చివరికి అంతిమ నిర్ణయం మాత్రం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు అపెంబ్లీలో జరిగిన వాటిన్నంటిని కేంద్రం కేవలం అభిప్రాయాలుగా మాత్రమే పరిగణిస్తుందని తెలిపారు.
తెలంగాణ సాధనలో మరో కీలకఘటం పూర్తి





