Monday, 2 November 2026

సీఎం తీర్మానం అడ్డుకాదు


తెలంగాణ ఏర్పాటు ఖాయం
కేంద్ర హోం మంత్రి షిండే
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీర్మానం అడ్డుకాదని కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. విభజన బిల్లు సందర్భంలో సీఎం తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కామెంట్లపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. సీఎం తీరు సరిగా లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌, హోం మంత్రి షిండే వేర్వేరుగా వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న కేంద్రం సీఎం తీసుకుంటున్న చర్యలను కూడా కనిపెడుతోంది. దీనికితోడు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని సమాచారం. అయినా అసెంబ్లీ తీర్మానంతో తెలంగాణకు అడ్డు కాదన్నారు. సీమాంధ్రకు న్యాయం చేస్తూనే తెలంగాణ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీమాంధ్రుల అభ్యంతరాలను తాము తప్పకుండా పరిష్కరిస్తామని డిగ్గీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటు పైన తాము హామీ ఇచ్చామని, దానిని నెరవేరుస్తామన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పారు. అదే విధంగా హైదరాబాదులో సీమాంధ్రులకు విద్య, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పారు. తెలంగాణ బిల్లును డస్ట్‌ బిన్‌లో వేయాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని చెప్పారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు బిల్లు చేరుతుందని చెప్పారు. తెలంగాణపై నిర్ణయానికి ముందు ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చేసి ఉండాల్సిందన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సీమాంధ్ర నేతలు అప్పుడు తమ సమస్యలపై ఎందుకు చెప్పలేదన్నారు. రాజ్యసభ రెబల్‌ అభ్యర్థులపై మధ్యాహ్నం మూడు గంటల వరకు చూస్తామన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో ఎలాంటి న్యాయపరమైన అంశాలు రావని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అన్నారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లు పాస్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీర్మానంతో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే సిఎం ఇలా చేస్తారని తాము అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తాను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌ రంగంపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *