Monday, 2 November 2026

ముంబైలో మోనో రైలు సేవలు

ముంబై, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :
దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభమయ్యాయి. శనివారం మోనో రైలు సేవలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌ ప్రారంభించారు. వడాల-చెంబూర్‌ మధ్య 8.9 కిలోమీటర్ల మేర మోనో రైలు సర్వీసులు నడుపనున్నట్లు చవాన్‌ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకూ ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మలిదశలో జాకబ్‌ సర్కిల్‌ వరకు ఈ రైలు మార్గాన్ని పొడిగిస్తారు. దీంతో ముంబై నగరంలో మొత్తం 20కిలోమీటర్ల మేర మోనో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగు కంపార్ట్‌మెంట్లు ఉండే మోనో రైలులో 560 మంది ప్రయాణం చేయవచ్చు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *