Monday, 2 November 2026

కాంగ్రెస్‌, బీజేపీయేతర శక్తులే ప్రత్యామ్నాయం

పార్లమెంట్‌ సమావేశాల తర్వాత మరింత స్పష్టత
వైసీపీ కాంగ్రెస్‌యేతర సెక్యులర్‌ పార్టీయే : ప్రకాశ్‌ కారత్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) :
దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ వెల్లడించారు. శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో యూపీఏ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ధరలు, అవినీతి విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీలు రెండు ఒకే విధానంతో ముందుకు వెళ్తున్నాయని, రెండు పార్టీల్లో పెద్ద తేడా ఏమీలేదన్నారు. ఏ రాజకీయ పార్టీలైనా మేనిఫెస్జోలో ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తిస్తారని, దాన్ని బట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. తాము ఇప్పటికే 8 రాష్ట్రాల్లో 37 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆ నియోజవర్గాలను గుర్తించామన్నారు. దేశంలోని భావసారూప్యత కలిగిన సమాజ్‌వాద్‌ పార్టీ, ఏఐడీఎంకే, బిజూ జనతాదళ్‌, జనతాదళ్‌ యునైటెడ్‌, జనతాదళ్‌ సెక్యూలర్‌ వంటి పార్టీలను కలుపుకుపోతామని చెప్పారు. టీడీపీ బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించడంతో ఆ పార్టీపై తాము దృష్టి సారించడంలేదన్నారు. దేశంలోని పది వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని పోతామని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉందని, పార్లమెంట్‌ సమావేశాల్లో విభజన బిల్లుపై కేంద్రం తీసుకునే నిర్ణయం తర్వాత రాజకీయాల్లో ఒక స్పష్టత వస్తుందన్నారు. శనివారం జరిగిన రాష్ట్ర సీపీఎం కమిటీ సమావేశాల్లో అన్ని విషయాలను చర్చిస్తున్నామని, ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పార్లమెంట్‌ సమావేశాల తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు. వైసీపీని కాంగ్రెసేతర సెక్యులర్‌ పార్టీగా గుర్తిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునే విషయంలో తాము సానుకూలంగానే వ్యవహరిస్తామని కారత్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో తాము సమైక్యవాదమే వినిపిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే థర్డ్‌ఫ్రంట్‌ అంటూ ఆలోచన లేదన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి తమ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. తమపోరాటం అంతా యూపీఏ అవినీతి, బీజేపీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుపై ఇప్పటివరకు దృష్టి కేంద్రీకరించలేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన కారత్‌ శనివారం ఎం.బి భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌, భారతీయ జనతాపార్టీలు ఇతర పక్షాలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ మతతత్వ బిజెపితో జతకడుతోందని వెల్లడించారు. తెలంగాణ విషయంలో పార్టీ విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. వైసిపిని సెక్యూలర్‌ పార్టీగానే గుర్తిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం మధ్య ఎన్నికల పొత్తు అంశం రాష్ట్ర కమిటీల పరిధిలోనిదని తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీకే పరిమితమని ప్రకాశ్‌ కారత్‌ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత పార్టీ పరంగా తమ వైఖరిని వెల్లడించడం జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సిపిఎం కట్టుబడి ఉందని తెలిపారు. జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో ఎన్నికల పొత్తులపై కూడా ఇంతవరకు ఎలాంటి ఆలోచన జరగలేదని వెల్లడించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్‌ పార్టీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు, మతహింస నిరోధక బిల్లులను తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల పరిధిలో ఉన్న 36 లోక్‌సభ స్థానాల నుంచి సిపిఎం అభ్యర్థులను పోటీలోకి దించాలని ప్రాథమికంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. తెలంగాణపై తమ పార్టీ విధానం మారలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ అన్నారు. గతంలోనూ ఇప్పుడు కూడా తాము ఒకే ఆలోచనా విధానంతో ఉన్నామని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రలకు కట్టుబడి ఉన్నామని అన్నారు.అదేవిధంగా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు తమ విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్లమెంటులో నిర్ణయం వచ్చిన తర్వాతనే వ్యూహాలను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. బీజేపీతో పొత్తుకు టీడీపీ ఆసక్తి చూపుతోందని ప్రకాష్‌ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల తర్వాత ఎన్నికల వ్యూహంపై దృష్టి పెడతామని, బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీలతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ విధానాల్లో పెద్దగా మార్పులేదని ప్రకాష్‌ కారత్‌ పేర్కొన్నారు. 8 రాష్ట్రాల్లో 35 స్థానాల్లో పోటీకి ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో లబ్దికోసమే మహిళా రిజర్వేషన్‌ బిల్లు, మతహింస నిరోధక బిల్లు తేవాలని భావిస్తోందన్నారు. అయితే వైకాపాపై కారత్‌ వ్యాఖ్యలు ఆ పార్టీతో పొత్తు దిశగా అడుగులు వేసేలా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీతో రాష్ట్రంలో సిపిఎం ఎన్నికల పొత్తు పెట్టుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌ శనివారం చేసిన వ్యాఖ్యలు ఆ సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *