Tuesday, 3 November 2026

శాస్త్రసాంకేతిక రంగాలు దేశాభివృద్ధికి సోపానాలు కావాలి


ప్రధాని మన్మోహన్‌సింగ్‌
జమ్మూ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
శాస్త్ర సాంకేతిక రంగాలు దేశాభివృద్ధికి సోపానాలు కావాలని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. సోమవారం జమ్మూలోని యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూలో నిర్వహించిన 101వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి ఏడు వేల మంది శాస్త్రవేత్తలు హాజరయ్యారు. స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతం శాస్త్ర సాంకేతిక రంగానికి ఉపయోగించాలని ప్రధాని పేర్కొన్నారు. తమిళనాడులో రూ.1,450 కోట్లతో న్యూట్రినో బేస్డ్‌ అబ్జర్వేటరీ నెలకొల్పడానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరమైన అంశాల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం, పరిశోధనలు చేయడం ద్వారా దేశం ప్రగతి సాధిస్తోందని అన్నారు. దేశాభివృద్ధి సాంకేతికాభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందని దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వసించే వారిని మన్మోహన్‌ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అధ్యయనానికి పరిశోధనల్లో విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇన్‌స్పైర్‌ అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *