
విపక్షాలు సహకరించాలి : రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
అవినీతికి అంతానికి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులకు విపక్షాలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను రాహుల్ లుసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన దాడిలో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు మృతిచెందిన విషయం తెలిసిందే. జాతివివక్ష దాడులను అరికట్టాలని కోరుతూ ఆ రోజు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ దాడి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఘటన స్థలం నుంచి రాహుల్, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేతో మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై వేధింపులు అఘాయిత్యాలు ఇకపై జరుగకుండా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో పంతాలకు పోకుండా ప్రజల కోసం, అవినీతి అంతానికి తీసుకువచ్చే బిల్లులకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.
అవినీతి అంతానికే బిల్లులు




