
సవరణలు ప్రతిపాదించా
సానుకూలంగా ప్రధాని
టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే తిరిగి వస్తానని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ బిల్లును కచ్చితంగా పాస్ చేయడానికి కమిట్ అయ్యామని చెప్పారని అన్నారు. మార్పులు, చేర్పులకు సంబంధించి వినతి పత్రం సమర్పించామన్నారు. తాను ఢిల్లీకి వచ్చేటపుడు తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తానని చెప్పన మాట నిజమవుతోందని కెసిఆర్ అన్నారు. తాము కలిసినపుడు ప్రధాని స్పందించిన తీరు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ప్రధానిని 40 మంది బృందంతో వెళ్లి కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున కతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై టీఆర్‌ఎస్ అభిప్రాయాలను ప్రధానికి వివరించామని, తమ డిమాండ్లతో మెమొరాండం సమర్పించామని తెలిపారు. టీ బిల్లులో పలు మార్పులు చేయాలని ప్రధానిని కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్‌పై గవరన్నర్ పెత్తనంతో పాటు పలు అంశాలను వివరించామని అన్నారు. తాము ఈ సమస్యను సానుభూతితో పరిష్కరిస్తామని హావిూ ఇచ్చినట్టు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును పాస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందని అన్నట్టు వెల్లడించారు. తాను ఢిల్లీ వచ్చేటపుడు తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తానని చెప్పానని ఇపుడు ప్రధాని మాటలతో తన మాట నిజం కాబోతుందని అన్నారు. బిల్లులో సవరణలు కూడా ప్రధానికి వివరించినట్లు చెప్పారు. తెలంగాణ బిల్లును కచ్చితంగా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని ప్రధాని చెప్పారని కేసీఆర్ వివరించారు. తమ అభ్యర్థనను లిఖిత పూర్వకంగా ప్రధానికి తెలియజేశామన్నారు. పార్లమెంట్ బీఏసీ సమావేశం తర్వాత అన్ని విషయాలపై స్పందింస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుపై టీఆర్‌ఎస్ అభిప్రాయాలను ప్రధానికి వివరించామని, తమ డిమాండ్లతో మెమొరాండం సమర్పించామని తెలిపారు. టీ బిల్లులో పలు మార్పులు చేయాలని ప్రధానిని కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. తెలంగాణ బిల్లుకు ఢిల్లీలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న టీఆర్‌ఎస్ అధినేత ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కలిశారు. తాము తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇస్తామని వారు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు రాష్టీయ్ర లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ మొదటి నుంచి పూర్తి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. మద్దతు పలికిన సీపీఐ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ బందంతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఏబీ బర్దన్, ఎంపీ డీ రాజా కూడా పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటికి..




