Tuesday, 3 November 2026

మీదే ద్వంద్వ వైఖరి


మేం మాట తప్పలేదు : సుష్మాస్వరాజ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని బీజేపీ పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌ నడిస్తే బిల్లుల పరిస్థితేంటో తెలుస్తుందని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానితో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడానికి కేంద్రం యోచిస్తుందని ఆమె పేర్కొంది. అయితే వాటికి పార్లమెంట్‌లో సవరణలు, ఓటింగ్‌ జరపాల్సి ఉంటుందన్నారు. ప్రధాని అధ్యక్షతన కేబినెట్‌ ఆమోదం తెలిపిన టీ బిల్లును ఏపీకి పంపిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రే బిల్లును తిరస్కరించాడని ఆమె వివరించింది. ఇరుప్రాంతాల వారిని ఒకతాటిపైకి తేవడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసి గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తోందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో బిజెపి వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రధానమంత్రి అధ్యక్షతన తెలంగాణ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపితే, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దానిని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇరు ప్రాంతాల వారిని ఏకతాటి పైకి తేవడంలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. పార్లమెంటు- నడిస్తే బిల్లుల పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. సోషల్‌విూడియా, డీటీహెచ్‌, మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కోట్లాది ప్రజలను చేరుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. చాయ్‌పై చర్చ ప్రచార కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12న బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారని సుష్మ తెలిపారు. దేశవ్యాప్తంగా 300 నగరాలు, వెయ్యి ప్రాంతాల్లో ‘చాయ్‌ పర్‌ చర్చ’ కార్యక్రమం ద్వారా 2 కోట్ల మందిని చేరుకుంటామని సుష్మాస్వరాజ్‌ పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్‌ ఆరోపిపంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *