
ఢిల్లీ : ఢిల్లీ 15 వ లోక్ సభ చివరి సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన పార్లమెంట్ మాజీ సభ్యులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. 15వ లోక్‌సభ చివరి సమావేశమైనందున సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే సీమాంద ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్యాంధ్రకు మద్ధతుగా నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. సీమాంధ్ర ఎంపీల ఆందోళన మధ్యే తానియా హత్యోదంతంపై స్వల్పకాలిక చర్చజరిగింది
లోక్‌సభ రేపటికి వాయిదా




